ePaper
More
    Homeఅంతర్జాతీయంPakistan Defense Minister | మరోసారి రెచ్చిపోయిన పాక్ రక్షణ మంత్రి.. సింధు జలాలు మళ్లించే...

    Pakistan Defense Minister | మరోసారి రెచ్చిపోయిన పాక్ రక్షణ మంత్రి.. సింధు జలాలు మళ్లించే ఏ నిర్మాణమైన పేల్చేస్తామని వ్యాఖ్య

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pakistan Defense Minister | పహల్​గామ్​ ఉగ్రవాద దాడితో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ Pakistan Defense Minister Khawaja Asif మరోమారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు నది జలాలను Indus River మళ్లించేలా భారత్ ఏదైనా నిర్మాణాన్ని చేపడితే దానిని ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. సింధు జలాల Indus River ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇస్లామాబాద్ Islamabad దాడి చేస్తుందని వ్యాఖ్యానించారు. సింధు జలాల ఒప్పందం అమలుకు అందుబాటులో ఉన్న అంతర్జాతీయ వేదికలపై international platforms పాక్ పోరాడుతుందని చెప్పారు. సింధు నదిపై భారత్ ఏదైనా నిర్మిస్తే ‘భారతీయ దురాక్రమణ’గా పరిగణిస్తామని తెలిపారు.

    Pakistan Defense Minister | కవ్వింపు చర్యలు..

    జమ్మూ కశ్మీర్​లోని Jammu and Kashmir పహల్​గామ్​లో 26 మంది పర్యాటకల ఊచకోత తర్వాత భారత్ పాక్​పై కఠిన చర్యలు చేపట్టింది. సీమాంతర ఉగ్రవాదాన్ని terrorism ఎగదోస్తున్న దాయాదికి బుద్ధి వచ్చేలా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దీనిపై తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ Defense Minister Khawaja Asif మాట్లాడుతూ “ఖచ్చితంగా, వారు ఏదైనా నిర్మాణాన్ని చేపట్టడానికి ప్రయత్నిస్తే, మేము దానిపై దాడి చేస్తాము. దూకుడు అంటే ఫిరంగులు, బుల్లెట్లను కాల్చడం మాత్రమే కాదు. దానికి అనేక రకాలు ఉన్నాయి. అందులో ఒకటి నీటిని లేదా మళ్లించడం. ఇది ఆకలి, దాహం కారణంగా మరణాలకు దారితీస్తుందని” వ్యాఖ్యానించారు. సింధు జలాల Indus River ఒప్పందాన్ని ఉల్లంఘించడం భారతదేశానికి అంత సులభం కాదని ఖవాజా ఆసిఫ్ Khawaja Asif అభిప్రాయపడ్డారు.

    Pakistan Defense Minister | మోదీపై అనుచిత వ్యాఖ్యలు

    పాక్ రక్షణ మంత్రి Pakistan Defence Minister ఖవాజా ఆసిఫ్ ప్రధాని మోదీని Prime Minister Modi ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాల political gains కోసం ప్రధాని మోదీ డ్రామా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. భారతదేశం ‘నిరంతరం రెచ్చగొడుతోందని, దానిపై ఇస్లామాబాద్ Islamabad ప్రతీకార చర్య మాత్రమే తీసుకుంటుందన్నారు. భారతదేశంతో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ దేనికైనా సిద్ధంగా ఉందని ఆసిఫ్ పేర్కొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...