అక్షరటుడే, వెబ్‌డెస్క్ :PSL | పాకిస్తాన్ సూపర్ లీగ్(Pakistan Super League) ఇటీవలే ముగిసింది. క్వెట్జా గ్గాడియేటర్స్, లాహోర్ ఖలందర్స్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగగా, ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ మూడోసారి పీఎస్ఎల్ ట్రోఫీ(PSL Trophy)ని దక్కించుకుంది. ఇక గెలిచారంటే వారి రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రోఫీ గెలిచిన సందర్భంగా ప్లేయర్స్ Players సెలబ్రేట్ చేసుకుంటున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో తమకు ఐఫోన్స్ గిఫ్ట్‌గా ఇస్తున్నారని చెప్పడంతో అందరు ఎగిరి గంతులు వేశారు. ట్రోఫీ గెలిచిన దాని కన్నా ఎక్కువగా సంబురాలు చేసుకున్నారు. ట్రోఫీ గెలిచాక టీమ్‌ని ఉద్దేశించి ఫ్రాంచైజీ ఓనర్ మాట్లాడారు.
PSL | మరీ ఇంత దారుణమా?
ఆ తర్వాత కెప్టెన్ షాహీన్ ఆఫ్రిది(Captain Shaheen Afridi) మాట్లాడుతూ.. ఈ సారి అందరికి ఐఫోన్(iPhone)లు ఇస్తున్నామంటూ అనౌన్స్ చేశారు. ఇది విన్న ప్లేయర్స్ ఒక్కసారిగా అరుచుకుంటూ గంతులేసారు. ట్రోఫీ (Trophy) గెలిచిన దాని కన్నా ఎక్కువ ఆనందం చెందారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై తెగ ట్రోలింగ్ నడుస్తుంది. మీరు మారరా? మీ జీవితంలో ఎప్పుడు చూడలేదా? అంటూ ఫ్యాన్స్ వాళ్లని ట్రోల్ చేస్తున్నారు. ఐఫోన్స్ అనేది ఓ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్‌కి పెద్ద విషయం ఏది కాదని, ప్లేయర్స్ మాత్రం దానిని తొలిసారి చూస్తున్నట్టు ఎందుకంత సంబురపడిపోతున్నారని ఓ యూజర్ కామెంట్ చేశారు.
చీప్‌నెస్ కి ఇంతకి మించి మరొకటి ఉండదు. ట్రోఫీ గెలిస్తే ఐఫోన్ ఇవ్వడమేంటో అర్ధం కావడం లేదని అంటున్నారు. పాకిస్తాన్ (Pakistan) దేశమే కాదు అక్కడి క్రికెటర్స్ కూడా ఎలాంటి దుస్థితిలో ఉన్నారనేది ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. ఇలాంటి పాకిస్తాన్ సూపర్ లీగ్.. ఐపీఎల్(IPL)తో పోటీ పడుతుండడం విడ్డూరం అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ అందరిని ఆశ్చర్యింపజేయడం విశేషం.