అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | ఐఎన్‌ఎస్ విక్రాంత్ (INS Vikranth) పేరు వింటే శత్రువులకు నిద్ర పట్టదని ప్రధాని మోదీ అన్నారు. దీపావళి వేడుకల (Diwali celebrations)ను ఆయన గోవా సముద్ర తీరంలోని INS విక్రాంత్‌లో జరుపుకున్నారు.
ప్రధాని ప్రతి ఏడాది దీపావళి పండుగను సైనికులతో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆయన నేవీ అధికారులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. నేవీ అధికారులు, సిబ్బందితో కలిసి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఓవైపు అనంతమైన ఆకాశం ఉంటే.. మరోవైపు అనంత శక్తులు కలిగిన INS విక్రాంత్ ఉందని కొనియాడారు. INS విక్రాంత్‌లో దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు.
PM Modi | రక్షణ సామర్థ్యానికి ప్రతీక
దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. ఐఎన్‌ఎస్ విక్రాంత్ మన రక్షణ సామర్థ్యానికి ప్రతీక అన్నారు. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో ఇండియన్ నేవీ ముందుకు సాగుతోందన్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో సత్తా చాటిన త్రివిధ దళాలకు ఆయన సెల్యూట్ చేశారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్ పాకిస్థాన్‌కు నిద్రలేని రాత్రులు మిగిల్చిందన్నారు. పాక్‌ను మోకాళ్లపై కూర్చొబెట్టిందని వ్యాఖ్యానించారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను పాక్ సరిహద్దు జలాల్లో మోహరించింది. ఇస్లామాబాద్ ఎదైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే దాడి చేయడానికి సిద్ధంగా ఉంచింది. దీనిని ప్రస్తావిస్తూ మోదీ ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను చూసి పాక్ నౌకలు అడుగు ముందుకు వేయాలంటే భయపడిపోయాయన్నారు. INS విక్రాంత్ ఆత్మనిర్భర్ భారత్, మేడిన్ ఇండియాకు ప్రతీక అని తెలిపారు. బ్రహ్మోస్, ఆకాశ్ మిస్సైళ్లు తమ సత్తా ఏంటో చూపించాయని ఆయన పేర్కొన్నారు.