ePaper
More
    Homeఅంతర్జాతీయంMissile attack | రెచ్చిపోయిన పాక్..​ క్షిపణులతో దాడులు.. అడ్డుకున్న భారత్​

    Missile attack | రెచ్చిపోయిన పాక్..​ క్షిపణులతో దాడులు.. అడ్డుకున్న భారత్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Missile attack | భారత్​ ఆపరేషన్​ సిందూర్​ operation sindoor పేరిట పాక్​లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు వంద మంది ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. అయితే భారత్​ దాడులతో ఉలిక్కిపడ్డ పాక్​ ప్రతీకారంతో రగిలిపోతుంది. ఇప్పటికే కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ LOC వెంబడి నిత్యం కాల్పులకు పాల్పడుతున్న పాక్​ ఆర్మీ తాజాగా క్షిపణులను missile attack ప్రయోగించింది. బుధవారం అర్ధరాత్రి పాకిస్తాన్​ మిసైల్స్​తో భారత్​పై దాడి చేసింది.

    Missile attack | తిప్పికొట్టిన భారత్​

    పాక్​ క్షిపణి దాడులను భారత్​ తిప్పికొట్టింది. నియంత్రణ రేఖవెంబడి పాకిస్థాన్‌ మిస్సైల్‌ దాడులు చేయగా భారత రక్షణ వ్యవస్థ defence system సమర్థవంతంగా అడ్డుకుంది. పంజాబ్​లోని అమృత్​సర్ amritsar​ లక్ష్యంగా పాక్​ క్షిపణులను ప్రయోగించింది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎస్​ 400 రక్షణ వ్యవస్థతో s defence system క్షిపణులను భారత్​ మధ్యలోనే కూల్చి వేసింది. భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే మిసైల్స్​తో పాక్​ క్షిపణులను భారత్​ అడ్డుకుంది.

    పంజాబ్‌లో మిస్సైల్‌ భాగాలను ఆర్మీ అధికారులు గుర్తించారు. పంజాబ్​లోని జెతువాల్, మఖన్​ విండి, పాందేరు శివారు ప్రాంతాల్లో క్షిపణుల శకలాలు లభ్యం అయ్యాయి. మరోవైపు సరిహద్దులో బుధవారం రాత్రి నుంచి పాక్​ సైన్యం విచక్షణరహితంగా కాల్పులు జరుపుతోంది. పాకిస్తాన్​ కాల్పుల్లో ఇప్పటికే 14 మంది పౌరులు మరణించిన విషయం తెలిసిందే. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలను భారత ఆర్మీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...