HomeUncategorizedPakistan Army Chief | పాక్ ఆర్మీ చీఫ్‌కు ప‌దోన్న‌తి.. ఫీల్డ్ మార్ష‌ల్ హోదా క‌ల్పిస్తూ...

Pakistan Army Chief | పాక్ ఆర్మీ చీఫ్‌కు ప‌దోన్న‌తి.. ఫీల్డ్ మార్ష‌ల్ హోదా క‌ల్పిస్తూ నిర్ణ‌యం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pakistan Army Chief | సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని ఎగ‌దోస్తున్న పాకిస్తాన్ బుద్ధి మారలేదు. భార‌త్ (india) చేతిలో చావుదెబ్బ తిన్న దాయాదికి కనీసం క‌నువిప్పు క‌లుగ‌లేదు. భార‌త్‌ను రెచ్చ‌గొట్టే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్న పాకిస్తాన్‌ (pakistan).. త‌న ఆర్మీ చీఫ్‌కు ప‌దోన్న‌తి క‌ల్పించింది. ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కు (Army Chief General Asim Munir) ఫీల్డ్ మార్షల్ హోదాను కల్పించే ప్రతిపాదనను పాక్ మంత్రివ‌ర్గం మంగ‌ళ‌వారం ఆమోదించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొన‌సాగుతున్న త‌రుణంలో దాయాది ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక కార‌ణాలేమిట‌న్న‌ది ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు.

Pakistan Army Chief | అందుకే ప‌దోన్న‌తి క‌ల్పించార‌ట‌..

ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ (Prime Minister Shehbaz Sharif) అధ్యక్షతన మంగ‌ళ‌వారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో (cabinet meeting) ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంతో జరిగిన వివాదంలో మునీర్ “ఆదర్శప్రాయమైన పాత్ర” పోషించినందుకు ఆయనకు పదోన్నతి లభించిందని ప్రభుత్వ టెలివిజన్ ఛానల్ PTV నివేదించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్ (pakistan) శాంతిని కోరుకుంటుండగా, తమ జాతీయ ప్రతిష్టను కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవడానికి తాము వెనుకాడబోమని అసిమ్ మునీర్ ప్రకటించారు.

Pakistan Army Chief | యుద్ధానికి కార‌కుడు మునీరే!

పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ (Pakistan Army Chief Asim Munir) ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల కార‌ణంగానే ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌దాడికి (pahalgam terror attack) కార‌ణ‌మ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కాశ్మీర్ త‌మ జీవ‌నాడి అని, భార‌త్‌, పాకిస్తాన్‌ల‌ది (india – pakistan) భిన్న మ‌న‌స్త‌త్వ‌మ‌ని పేర్కొన్నారు. ఆయ‌న మాట్లాడిన రోజుల వ్య‌వ‌ధిలోనే ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌దాడి జ‌రిగింది. అమాయ‌కులైన 26 మంది పర్యాటకులను పొట్ట‌న బెట్టుకున్నారు. దీంతో దేశ‌వ్యాప్తంగా ఆగ్ర‌హం వ్య‌క్తం కాగా, భార‌త్ త‌గిన రీతిలో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పింది. దాయాది దేశంలోకి చొచ్చుకెళ్లి మ‌రీ ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై (terror camps) దాడి చేసి నేల‌మ‌ట్టం చేసింది. ఆ త‌ర్వాత పాక్ ప్ర‌తి స్పందించ‌డంతో ఆ దేశానికి చెందిన సైనిక మౌలిక వ‌స‌తుల‌ను ధ్వంసం చేసింది. దీంతో భ‌య‌ప‌డిన పాక్ కాల్పుల విర‌మ‌ణ పేరుతో కాళ్ల‌బేరానికి వ‌చ్చింది.

Must Read
Related News