అక్షరటుడే, వెబ్డెస్క్ : Pakistan Army Chief | ఏప్రిల్ 22న 26 మంది పౌరులను బలిగొన్న దారుణమైన పహల్గామ్ ఉగ్రవాద దాడి పాకిస్తాన్ ఆర్మీ హస్తం ఉందని ఆ దేశానికి చెందిన ఆర్మీ మాజీ మేజర్ ఆదిల్ రజా (Former army major Adil Raza) వెల్లడించారు.
తనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసమ్మతి నుంచి దృష్టిని మళ్లించి తన పదవిని కాపాడుకోవడానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ (Pakistan Army Chief Asim Munir) పన్నిన కుట్ర పహల్గామ్ దాడి (Pahalgam attack) అని ఇండియా టీవీతో తెలిపారు. పహల్గామ్ దాడి సూత్రధారి అయిన మునీర్తో పాటు పాకిస్తాన్ సైన్యంలోని నలుగురు నుంచి ఐదుగురు ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందని వెల్లడించారు.. పహల్గామ్ లో రక్తపాతానికి కారణమైన ఈ అధికారుల పేర్లు, ముఖాలు, హోదాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయన్నారు.
Pakistan Army Chief | ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్..
పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులకు ఎలా మద్దతు ఇస్తుందో, జమ్మూ కాశ్మీర్లో (Jammu and Kashmir) హింసను నిర్వహించడానికి హ్యాండ్లర్ల ద్వారా పాకిస్తాన్ లోపల నుంచి ఎలా పనిచేస్తుందో రాజా సవివరంగా వెల్లడించారు. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం (Terrorism) మరియు పహల్గామ్ ఊచకోతతో సహా భారతదేశంలో ఉగ్రవాద దాడులను (Terrorist Attacks) నిర్వహించడంలో వారి సైనిక, నిఘా సంస్థల హస్తం ఉందన్న భారత వాదనను ఆయన వ్యాఖ్యలు నిర్ధారించాయి.
పాక్ సైన్యం ఉగ్రవాద దాడిలో పాల్గొన్నట్లు, అసిమ్ మునీర్ దానిలో ప్రత్యక్ష పాత్ర పోషించిందని రజా వెల్లడించారు.ఈ ప్రణాళికను అమలు చేసిన ISI అధికారుల గురించి తనకు తెలుసునని, కానీ పాకిస్తాన్ సైనిక నాయకత్వం వెనక్కి తగ్గలేదన్నారు. అసిమ్ మునీర్ ఈ ప్రణాళికను పెద్ద వ్యూహంలో భాగంగా రూపొందించారని ఆయన వివరించారు.
భారతదేశంపై (India) పాకిస్తాన్ పదేపదే వైఫల్యాలతో నిరాశ చెందిన మునీర్ సైన్యంలో తన స్థానాన్ని కాపాడుకోవడానికి ఒక పెద్ద ఆపరేషన్ నిర్వహించాలనుకున్నాడు. మునీర్ ఇటీవల ఫీల్డ్ మార్షల్ (field marshal) హోదాకు పదోన్నతి పొందాడని, ఈ దాడి అధికారం, ప్రభావాన్ని నిరూపించుకునే తన ప్రయత్నంలో భాగమని రాజా ఎత్తిచూపారు.
ఈ దాడిలో కీలక పాత్ర పోషించిన మరో ఇద్దరు పాకిస్తానీ అధికారులను ఆదిల్ రాజా (Adil Raza) పేర్కొన్నారు. మొదటి వ్యక్తి ఐఎస్ఐ డిజి మొహమ్మద్ అసిమ్ మాలిక్ (ISI DG Mohammad Asim Malik), రెండవ వ్యక్తి మొహమ్మద్ షాహబ్ అస్లాం (Mohammad Shahab Aslam). పహల్గామ్ ఉగ్రవాద దాడిలో (Pahalgam terror attack) షాహబ్ అస్లాం ప్రత్యక్ష పాత్ర పోషించాడని, దాడి చేసిన ఉగ్రవాదులతో ప్రత్యక్ష సంబంధాలు కొనసాగించాడని రాజా అన్నారు.