అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pakistan airstrike | పాకిస్తాన్ Pakistan హద్దులు దాటుతోంది. కాల్పుల విరమణ ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేస్తోంది. తాజాగా పాక్టికా ప్రావిన్స్‌లో వైమానిక దాడికి దిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్ PAkistan, అప్ఘానిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్లో భాగంగా ఈస్ట్రన్ పాక్టికా Eastern Paktika ప్రావిన్స్ పై పాకిస్థాన్ వైమానిక దాడి నిర్వహించింది.
ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఏడు మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు అఫ్ఘానిస్థాన్ దేశవాళి క్రికెటర్లు కూడా ఉన్నారు.
ఈ విషయం అఫ్ఘానిస్థాన్ Afghanistan క్రికెట్ బోర్డు (ACB) ధృవీకరించింది. అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు ప్రకారం, మృతి చెందిన క్రికెటర్లను కబీర్ అఘా, సిబాతుల్లా, హరూన్గా గా గుర్తించారు.
ఈ ముగ్గురు క్రికెటర్లు తూర్పు పాక్టికా ప్రావిన్స్ రాజధాని షరానాకు స్నేహపూర్వక మ్యాచ్ ఆడేందుకు వెళ్తుండగా.. వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దాడిలో ఐదుగురు అఫ్ఘాన్ పౌరులు కూడా మృతి చెందారు.
Pakistan airstrike | టెన్షన్ వాతావరణం..
ఈ ఘటనపై అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేసింది. అలాగే, వచ్చే నెలలో పాకిస్థాన్, శ్రీలంక Srilanka జట్లతో జరగబోయే ముక్కోణపు సిరీస్ నుంచి అఫ్ఘాన్ జట్టు వైదొలుగుతున్నట్లు కూడా ACB ప్రకటించింది.
అక్టోబరు 11 నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్నది. పాకిస్థాన్ ఆర్మీ తాలిబాన్లపై వైమానిక దాడులు జరిపింది. ఇందుకు ప్రతీకారంగా తాలిబాన్లు పాకిస్థాన్‌పై దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లోని పాకిస్థాన్ ఔట్ పోస్టుపై డ్రోన్ బాంబ్ దాడులు జరిగాయి.
ఈ దాడిపై అఫ్ఘాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ Rashid Khan స్పందించారు. “పాకిస్తాన్ వైమానిక దాడుల్లో పౌరులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఇది పూర్తిగా అనైతికం, అనాగరికం, మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘన. కోల్పోయిన అమాయక ప్రాణాలను గమనించి, పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌ల నుంచి వైదొలగడం ACB నిర్ణయం సబబే ” అని ట్వీట్ చేశారు. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉత్కంఠకరంగా మారుతున్నాయి.