HomeUncategorizedOperation Sindoor | పాకిస్థాన్‌పై మరోసారి భారత్ దాడులు.. ఎయిర్​ డిఫెన్స్​ వ్యవస్థ ధ్వంసం

Operation Sindoor | పాకిస్థాన్‌పై మరోసారి భారత్ దాడులు.. ఎయిర్​ డిఫెన్స్​ వ్యవస్థ ధ్వంసం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | పాకి​స్థాన్​కు భారత్​ మరో షాక్​ ఇచ్చింది. పహల్గామ్​ ఉగ్రదాడికి pahalgam terror attack ప్రతీకారంగా భారత్​ పీవోకేతో పాటు పాక్​లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే.

ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న ఆ దేశం తీరు మారలేదు. ఎల్​వోసీ LOC వెంబడి భారీగా కాల్పులకు తెగబడుతోంది. సామాన్య పౌరులే లక్ష్యంగా కాల్పులు జరుపుతోంది. ఇప్పటికే పాక్​ కాల్పుల్లో 13 మంది మృతి చెందగా.. చాలా మంది గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా భారత్​ ఈ సారి ధీటైన జవాబు ఇచ్చింది.

Operation Sindoor | ఎయిర్​ డిఫెన్స్​ వ్యవస్థలే లక్ష్యంగా..

ఎల్​వోసీ వెంబడి కాల్పులతో పాటు పాక్​ భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించింది. భారత గగనతల రక్షణ వ్యవస్థ వాటిని అడ్డుకుంది. ఎస్​ 400 డిఫెన్స్​ సిస్టంతో పాక్​ క్షిపణులను భారత్​ మధ్యలోనే కూల్చివేసింది. అయితే పాక్​ దాడికి ప్రతీగా భారత్​ ఈ సారి ఏకకాలంలో క్షిపణులతో విరుచుకుపడింది. ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలే లక్ష్యంగా దాడి చేసింది.

ఈ దాడిలో లాహోర్‌లోని HQ-9 గగనతల రక్షణ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. జమ్ముకశ్మీర్‌లోని LoC వెంట ఉన్న గ్రామాలపై పాక్ చేసిన దాడికి ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. పాక్​ మరోసారి దాడులకు యత్నిస్తే ప్రతిఘటన తీవ్ర స్థాయిలో ఉంటుందని భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది. కాగా ఆపరేషన్​ సిందూర్ operation sindoor​ ఇంకా ముగియలేదని రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ అఖిలపక్ష సమావేశంలో తెలిపారు. దీంతో పాక్​పై భారత్​ మరిన్ని దాడులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Must Read
Related News