అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan Air Bases : పాకిస్తాన్‌లోని కనీసం నాలుగు వైమానిక స్థావరాలను భారత్ నేడు (శనివారం మే 10) క్షిపణులు, డ్రోన్‌లతో దాడి చేసే అవకాశం ఉన్నట్లు పాక్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. తమ వైమానిక స్థావరాలను భారత్ క్షిపణులు, డ్రోన్‌లు లక్ష్యంగా చేసుకున్నాయని పాక్ గతంలో పేర్కొంది.
పాక్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తెల్లవారుజామున 4:00 గంటలకు ఇస్లామాబాద్‌లో హడావిడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన నూర్ ఖాన్ (చక్లాలా, రావల్పిండి), మురిద్ (చక్వాల్), రఫికి (ఝాంగ్ జిల్లాలోని షోర్కోట్) వైమానిక స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుందని ఆయన చెప్పారు.
“ప్రస్తుతం వైమానిక దళానికి చెందిన అన్ని ఆస్తులు సురక్షితంగా ఉన్నాయి” అని అహ్మద్ షరీఫ్ చౌదరి పేర్కొన్నారు. భారత్ తన జెట్‌లతో ఉపరితల క్షిపణులను ప్రయోగించిందని అన్నారు. పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థ అనేక క్షిపణులను అడ్డగించిందని చెప్పుకొచ్చారు.
