అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pakistani woman | పాకిస్తాన్‌కు Pakistan చెందిన నిఖిత నాగ్దేవ్ అనే మహిళ, తన భర్త విక్రమ్ నాగ్దేవ్ మోసం చేశాడని ఆరోపిస్తూ భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించిన ఘటన ఇప్పుడు రెండు దేశాల్లోనూ చర్చనీయాంశమైంది.
నిఖిత పాకిస్తాన్లో విడుదల చేసిన వీడియోలో తన సమస్యలను వెల్లడిస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. నిఖిత చెప్పిన వివరాల ప్రకారం, 2020 జనవరి 26న పాకిస్తాన్లో హిందూ ఆచారాల ప్రకారం ఆమె విక్రమ్ నాగ్దేవ్ను వివాహం చేసుకుంది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రంలో (marriage certificate) పెళ్లి తేదీ జనవరి 20గా నమోదు అయింది.
Pakistani woman | వీసా పేరుతో తిరిగి పంపి… తరువాత నిర్లక్ష్యం?
వివాహం Marriage జరిగిన నెలరోజులకు, అంటే 2020 ఫిబ్రవరి 26న, విక్రమ్ తనను భారత్‌కు తీసుకువచ్చాడని నిఖిత తెలిపింది.అయితే అదే సంవత్సరం జూలై 9న వీసా సమస్యలతో తక్షణమే పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లాల్సి వస్తుందంటూ విక్రమ్ ఆమెను కరాచీకి పంపించాడు. అప్పటి నుంచి మరోసారి తనను భారత్‌కు తీసుకువచ్చేందుకు అతను ఎలాంటి ప్రయత్నం చేయలేదని నిఖిత ఆరోపిస్తోంది. విక్రమ్‌ను పదేపదే అడిగినా, అతడు నిరాకరించాడని తెలిపింది. తనను పూర్తిగా పట్టించుకోకుండా, ఢిల్లీకి (Delhi) చెందిన శివాంగి ధింగ్రా అనే మహిళతో విక్రమ్ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నాడని నిఖిత వెల్లడించింది. వీరి పెళ్లి 2026 మార్చి చివరి వారంలో జరగనున్నట్లు ఆమె ఆరోపించింది.
శివాంగిని (Shivangini) ఒకసారి సంప్రదించగా, విక్రమ్ వ్యక్తిగత వివరాల గురించి తనకు ఏమీ తెలియదని ఆమె చెప్పినట్లు నిఖిత తెలిపింది. ఇండోర్‌లోని సింధీ పంచాయతీ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని నిఖిత సంప్రదించగా, వారు ఫిర్యాదును స్వీకరించినప్పటికీ ఇది తమ అధికారం దాటి వెళ్లే అంశమని పేర్కొన్నారు. అయినప్పటికీ కలెక్టర్‌కు లేఖ రాసి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.పంచాయతీ చేసిన ముఖ్యమైన ఆరోపణలు: విక్రమ్ భారత పౌరుడు కాదని, దేశంలో అక్రమంగా నివసిస్తున్నాడని, ప్రభుత్వ అనుమతి లేకుండా ఆస్తులు కొనుగోలు చేశాడని, విక్రమ్‌పై చర్యలు తీసుకుని దేశ బహిష్కరణ చేయాలని పంచాయతీ డిమాండ్ చేసింది. కరాచీ కోర్టును ఆశ్రయించవచ్చని పంచాయతీ సూచించినప్పటికీ, నిఖిత భారత ప్రభుత్వమే తగిన న్యాయం చేస్తుందనే నమ్మకంతో వీడియో విడుదల చేసింది.