Homeక్రీడలుPAK vs SA | సౌతాఫ్రికా విజృంభించ‌డంతో చిత్తుగా ఓడిన పాక్.. వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి...

PAK vs SA | సౌతాఫ్రికా విజృంభించ‌డంతో చిత్తుగా ఓడిన పాక్.. వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ఔట్

PAK vs SA | మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025లో ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా జట్టు మరోసారి తన దూకుడు కొనసాగించింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా పాకిస్థాన్‌పై 150 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PAK vs SA | మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025 (Women ODI World Cup 2025) లో ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా South Africa జట్టు మరోసారి తన దూకుడు కొనసాగించింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై సౌతాఫ్రికా 150 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.

మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025లో భాగంగా అక్టోబ‌ర్ 21న‌ పాకిస్థాన్‌తో Pakistan జరిగిన‌ లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుత‌ ప్రదర్శన కనబరిచారు.

వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికా మహిళల జట్టు 312 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.

ప్రోటీస్ కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (90) అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. సూన్ లస్ (68 నాటౌట్), మారిజన్ కాప్ (67 నాటౌట్), నదినే డి క్లెర్క్ (41) మెరుపులు మెరిపించారు.

ముఖ్యంగా చివరి ఓవర్లలో నదినే డి క్లెర్క్ ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌కి ఆకర్షణీయంగా మారింది. 38వ ఓవర్‌లో ఆమె రెండు సిక్సర్లు బాదగా.. 39వ ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

PAK vs SA | పాక్ ఔట్‌..

చివరి ఓవర్‌లో కూడా బౌండరీతో ఆరంభించి సదియా ఇక్బాల్ బౌలింగ్‌లో ఔటైంది. చివరి ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ సౌతాఫ్రికా 40 ఓవర్లలో 9 వికెట్లకు 312 పరుగులు చేసింది.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో తజ్మిన్ బ్రిట్జ్‌, కరాబో మెసో, మ్లాబా డకౌట్లుగా వెనుదిరిగినా, మిగిలిన బ్యాటర్లు చేసిన పరుగులతో జట్టు భారీ స్కోర్ సాధించింది.

పాకిస్థాన్ బౌలర్లలో నష్రా సంధు, సదియా ఇక్బాల్ తలో 3 వికెట్లు తీశారు. కెప్టెన్ ఫాతిమా సనా ఒక వికెట్ పడగొట్టింది. అయితే మ‌రోసారి వ‌ర్షం వ‌ల‌న పాక్‌ లక్ష్యాన్ని 20 ఓవర్లలో 234గా నిర్దేశించగా 20 ఓవర్లలో 83/7కే పరిమితం కావ‌డంతో పాక్ ఖాతాలో మ‌రో ఓటమి చేరింది.

ఇక ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా South africa ఘ‌న విజ‌యం సాధించ‌డంతో.. 10 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇదిలా ఉండగా, ఈ విజయంతో సౌతాఫ్రికా టాప్ ప్లేక్‌కి చేరుకుంది.

ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు Semies చేరగా, నాలుగో స్థానంలో భారత్‌, న్యూజిలాండ్ జట్లు పోటీ పడుతున్నాయి.

అక్టోబర్ 23న ఇరు జట్ల మధ్య జరిగే కీలక మ్యాచ్‌తో సెమీఫైనల్ బరిలో చివరి జట్టు నిర్ణయం కానుంది. మరోవైపు, ఇప్ప‌టి వరకూ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడిన పాకిస్థాన్ మహిళల జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలోనే కొనసాగుతోంది.