HomeUncategorizedPak Spy | పాక్‌ గూఢచారి అరెస్ట్‌

Pak Spy | పాక్‌ గూఢచారి అరెస్ట్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Pak Spy | పాక్​ గూఢచారిని అధికారులు అరెస్ట్​ చేశారు. భారత రహస్యాలను పాకిస్తాన్​(Pakistan)కు చేరవేస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన దేవేంద్ర సింగ్​ 2024లో కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్​ వెళ్లాడు. అక్కడ పాకిస్తానీ నిఘా అధికారిని ఆయన కలిశాడు.హనీట్రాప్ ద్వారా దేవేంద్ర సింగ్‌ను పాకిస్తాన్​ నిఘా సంస్థ ఐఎస్​ఐ(Pakistan intelligence agency ISI) తమ గుప్పిట్లో పెట్టుకుంది. అనంతరం భారత సైనిక స్థావరాల వివరాలను ఆయన ద్వారా తెలుసుకుంది. దేవేంద్రసింగ్​ భారత సైనిక స్థావరాల వివరాలను పాక్‌కు అందించినట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు.

Pak Spy | గూఢచారులపై నిఘా

పహల్గామ్​ ఉగ్రదాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్​, పాకిస్తాన్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్​ ఆపరేషన్​ సిందూర్(Operation Sindoor)​ చేపట్టి పీవోకే, పాకిస్తాన్​లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్​లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం భారత్​ పాక్​ మధ్య దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో భారత అధికారులు అప్రమత్తం అయ్యారు. దేశంలో ఉంటూ పాక్​కు సమాచారం అందిస్తున్న వారిపై నిఘా పెట్టారు. పాక్​కు భారత రహస్యాలను చేరవేస్తున్న పలువురిని అరెస్ట్​ చేస్తున్నారు. ఇటీవల అమృత్​సర్​లో ఇద్దరు అనుమానితులను అరెస్ట్​ చేశారు. జై సల్మేర్(Jai Salmer)​లో మరో గూఢచారిని అరెస్ట్​ చేశారు. హర్యానాలో రెండు రోజుల క్రితం ఇద్దరిని, తాజాగా దేవేంద్రసింగ్​ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.