అక్షరటుడే, వెబ్‌డెస్క్: Missile Test | పహల్గామ్ ఉదంతం Pahalgam incident తర్వాత భారత్, పాకిస్తాన్ల India and Pakistan మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో శత్రు దేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఆ దేశ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా తాజాగా క్షిపణి ప్రయోగాలతో missile tests రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా అబ్దాలి వెపన్ సిస్టమ్ Abdali Weapon System క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్తాన్ శనివారం ప్రకటించింది.
ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే ఈ క్షిపణి missile 450 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుందని తెలిపింది. ‘‘భద్రతా దళాల security forces కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారించడం, క్షిపణి అధునాతన నావిగేషన్ వ్యవస్థ navigation system సహా కీలకమైన సాంకేతిక పరిమితులను ధ్రువీకరించడమే ఈ ప్రయోగ లక్ష్యమని” పాక్ సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
Missile Test | రెచ్చగొడుతున్న దాయాది..
కాశ్మీర్లోని Kashmir పహల్గామ్లో 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడి Pahalgam terror attack తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. పరస్పర ప్రతీకార చర్యలు రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇలాంటి తరుణంలో పాక్ క్షిపణి పరీక్షకు సిద్ధపడింది. సైన్యం ప్రకారం క్షిపణి ప్రయోగం missile test ‘ఎక్సర్సైజ్ ఇండస్’లో భాగమని, అంతకు మించి వివరాలు వెల్లడించలేమని తెలిపింది. విజయవంతంగా క్షిపణిని ప్రయోగించిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ Pakistani President Asif Ali Zardari, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అభినందనలు congratulated తెలిపారు. ఎవరైనా దురాక్రమణకు ప్రయత్నిస్తే జాతీయ భద్రతను కాపాడడానికి పాకిస్తాన్ Pakistan వ్యూహాత్మక దళాల కార్యాచరణ సంసిద్ధత, సాంకేతిక నైపుణ్యంపై వారు విశ్వాసం వ్యక్తం చేశారు.