అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nagara Padmasali Sangham | నూతనంగా ఎన్నుకోబడిన నగర పద్మశాలి సంఘం(Nagara Padmasali Sangham) కార్యవర్గ సభ్యులు సోమవారం మార్కండేయ మందిరంలో (Markandeya Temple) ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారి, అడ్వకేట్ గంగాప్రసాద్ నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు.
నగర అధ్యక్షుడు పెంట దత్తాద్రి, ప్రధాన కార్యదర్శి చౌటి భూమేశ్వర్, కోశాధికారి మోర సాయిలు, ఉపాధ్యక్షులు మురళి, శ్రీనివాస్, దుబ్బరాజం, సహాయ కార్యదర్శి భూస రవి, ఏనుగందుల సుభాష్, అవధూత రాములు, ప్రచార కార్యదర్శి శ్రీనివాస్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కస్తూరి గంగరాజులు ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ అధ్యక్షుడు గుజ్జేటి నర్సయ్య నుంచి దత్తాద్రి బాధ్యతలు తీసుకున్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు దాసరి నర్సింలు, ఎస్ఆర్ సత్యపాల్, అమృతాపూర్ గంగాధర్, భీమర్తి రవి, సిలివేరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.