అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Padmashali Sangham | నగరంలోని పద్మశాలి విద్యార్థి వసతిగృహం ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. నగరంలోని పద్మశాలి హైస్కూల్(Padmasali High School)లో ఆదివారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైంది.
ఈ ఎన్నికల్లో శంఖం గుర్తు నుంచి అధ్యక్షుడిగా ఎస్సార్ సత్యపాల్, సూర్యుడు గుర్తు నుంచి దికొండ యాదగిరి, ఏనుగు గుర్తు నుంచి కొండి రమేష్‌లు బరిలో నిలిచారు.ప్రధాన కార్యదర్శి అభ్యర్థులుగా శంఖం గుర్తు నుంచి క్యాతం జగన్మోహన్ సూర్యుడు గుర్తు నుంచి వెంకట నర్సయ్య, ఏనుగు గుర్తు నుంచి భీమర్తి రవిలు ఎన్నికల బరిలో నిలిచారు.పద్మశాలి వసతి గృహానికి(Padmasali Student Hostel) మొత్తం 894 సభ్యులు సభ్యత్వం తీసుకున్నారు. ఇందులో మధ్యాహ్నం రెండు గంటల వరకు 75 శాతం పోలింగ్(Polling) నమోదైంది. ఇందులో రెండు ఓట్లు ఛాలెంజ్ ఓట్లు నమోదు అయినట్లు ఎన్నికల అధికారి యాదగిరి(Election Officer Yadagiri) పేర్కొన్నారు.