అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నిజామాబాద్ (Nizamabad) నగర పద్మశాలి సంఘం (Padmashali Sangham) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకరం ఆదివారం బీఎల్‌ఎన్ గార్డెన్ (BLN Garden)లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, ఎమ్మెల్యేలు ధనపాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, భూపతి రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా ఛైర్మన్ కేశ వేణు హాజరయ్యారు. వారి సమక్షంలో నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.
అధ్యక్షుడిగా పెంట దత్తాద్రి, ప్రధాన కార్యదర్శి చౌటి భూమేశ్వర్, కోశాధికారిగా మోర సాయిలు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఏ రంగంలోనైనా సమగ్ర అభివృద్ధి సాధించాలంటే రాజకీయ ప్రాతినిధ్యం అత్యంత కీలకమన్నారు. పద్మశాలీలు రాజకీయంగా బలోపేతం కావాలని సూచించారు.
