HomeతెలంగాణPadmashali Sangam | హోరాహోరీగా పద్మశాలి సంఘం ఎన్నికలు

Padmashali Sangam | హోరాహోరీగా పద్మశాలి సంఘం ఎన్నికలు

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Padmashali Sangam | నిజామాబాద్ నగర పద్మశాలి ఎన్నికలు padmashali sangham nizamabad హోరాహోరీగా జరుగుతున్నాయి. వర్నీరోడ్​లోని​ (Varni road) పద్మశాలి ఉన్నత పాఠశాలలో (Padmasali High School) ఆదివారం పోలింగ్​ నిర్వహించారు. ఉదయం 9 గంటలకు పోలింగ్​ ప్రారంభమైంది.

నగరంలో మొత్తంగా 65 తర్పలు ఉండగా 5,200కు పైగా ఓటర్లు ఉన్నారు. అయితే 60 శాతానికి పైగా పోలింగ్​ నమోదైంది. 4వ టౌన్ ఎస్సై శ్రీకాంత్​ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా మూడు ప్యానళ్లు పోటీలో ఉండగా.. రెండు ప్యానెళ్ల మధ్యే పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. అనంతరం తుది ఫలితాలు వెలువడనున్నాయి.