అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Padmashali Sangham Nizamabad | పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలు ఈనెల 25న జరుగనున్నాయి. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్యానెల్ సభ్యులు నామినేషన్లు(Nominations) దాఖలు చేశారు. ప్యానెల్లో అధ్యక్షుడిగా పెంటం దత్తాద్రి(Pentam Dattadri) పోటీ చేయనున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా చోటి భూమేష్, ఉపాధ్యక్షులుగా భీమర్తి రవి, కన్నా దుబ్బ రాజం, బాగుల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా బీజీ ప్రసాద్, భూస రవి, ఎనుగందుల సుభాష్, కోశాధికారిగా మోర సాయిలు, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా కస్తూరి గంగరాజు, ప్రచార కార్యదర్శిగా బూస శ్రీనివాస్‌లు మార్కండేయ మందిరంలో నామినేషన్లు దాఖలు చేశారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా నాయకులు ఎస్సార్ సత్యపాల్, అమృతాపురం గంగాధర్, బిల్ల మహేష్, మదన్ మోహన్, సిలివేరి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా అడ్వకేట్ గంగా ప్రసాద్ ను నియమించారు. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరుగనుంది.
Padmashali Sangham Nizamabad | పద్మశాలి సంఘం ఎన్నికలకు నామినేషన్ దాఖలు
Published on
