అక్షరటుడే, వెబ్‌డెస్క్: Padma Awards 2026 | గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను (Padma Awards) ప్రకటించింది. మొత్తం 113 మందికి పద్మ శ్రీ ఇచ్చింది. ఐదుగురికి పద్మ విభూషణ్ (Padma Vibhushan), 13 మందికి పద్మ భూషణ్ అవార్డులు ప్రకటించింది.
భారత ప్రభుత్వం ఆదివారం పద్మ అవార్డుల జాబితాను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవలు మరిన్ని రంగాలతో సహా విస్తృత శ్రేణి విభాగాలలో విశిష్ట సేవలను అందించిన వారికి వీటిని ప్రదానం చేస్తారు. ఈ పురస్కారాలను రాష్ట్రపతి మార్చి, ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవన్లో జరిగే అధికారిక కార్యక్రమాలలో ప్రదానం చేస్తారు. 2026 సంవత్సరానికి గానూ మొత్తం 131 మందికి పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది.
Padma Awards 2026 | పద్మ విభూషణ్ పురస్కారం
కేంద్రం మొత్తం ఐదుగురిని పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ధర్మేంద్ర సింగ్ డియోల్ (మరణానంతరం), కె టి థామస్, ఎన్ రాజం, పి నారాయణన్, వి ఎస్ అచ్యుతానందన్ (మరణానంతరం) పద్మ విభూషణ్ పురస్కారాలకు ఎంపికయ్యారు. అల్కా యాగ్నిక్, భగత్ సింగ్ కోష్యారి, కల్పట్టి రామస్వామి పళనిసామి, మమ్ముట్టి, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, పియూష్ పాండే (మరణానంతరం), కె ఎం మేలానందన్, శతావధాని ఆర్ గణేష్, సిబ్బు సోరెన్ (మరణానంతరం), ఉదయ్ కోటక్, వి కె మల్హోత్రా (మరణానంతరం), విజయ్ అమృతరాజ్, వెల్లపల్లి నటేశన్ పద్మ భూషణ్ పురస్కారాలు పొందారు.
Padma Awards 2026 | తెలంగాణకు చెందిన ఏడుగురికి..
తెలుగు రాష్ట్రాలకు నుంచి 11 మందికి పద్మ అవార్డులు వచ్చాయి. ఏపీకి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, వెంపటి కుటుంబ శాస్త్రి, రాజేంద్రప్రసాద్, మాగంటి మురళీమోహన్‌కు పద్మశ్రీ వచ్చింది. తెలంగాణకు చెందిన విజయ్ ఆనంద్‌రెడ్డి, గడ్డమానుగు చంద్రమౌళి, దీపికారెడ్డి, కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్, డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, మామిడి రామారెడ్డి, గూడూరు వెంకట్రావుకు పద్మశ్రీ అవార్డులు వచ్చాయి.