అక్షరటుడే, ముప్కాల్ : Paddy center | రైతులు (Farmers) మద్దతు ధర కోసం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని ఏపీఎం హిమబాల పేర్కొన్నారు. ముప్కాల్ మండల (Mupkal mandal) కేంద్రంలోని నల్లూరు గ్రామంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రేడ్ ఏ వరి ధాన్యానికి రూ.2,389 మద్దతు ధర లభిస్తుందన్నారు. అలాగే సన్నాలకు రూ.500 బోనస్‌తో కలిపి రూ. 2,869 వస్తుందన్నారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బరకం గంగాధర్, పూర్ణిశెట్టి రమణ, పతాని శ్రీనివాస్, ఫణిందర్ గౌడ్, పంచాయతీ సెక్రెటరీ విఘ్నేష్, సీసీ విక్రమ్ రెడ్డి, వీడీసీ సభ్యులు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
