అక్షరటుడే, ఇందూరు: Induru Tirumala | జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ కోతలు ప్రారంభమయ్యాయి. మోపాల్ (Mopal) మండలంలోని నర్సింగ్‌పల్లిలో (Narsingpally) ఇందూరు తిరుమల (Induru Tirumala Temple) గోవింద వనమాల క్షేత్రంలో వరికోతలు ఆదివారం మొదలయ్యాయి.
ఈ సందర్భంగా ఇందూరు తిరుమల ఆలయ ప్రధాన ధర్మకర్త నరసింహారెడ్డి ముందుగా పొలం మైసమ్మకు భక్తితో పూజలు చేశారు. అనంతరం అన్నపూర్ణా మాతకు పూజచేసి కోతలను ప్రారంభించారు.
పంటలు బాగా పండి రాష్ట్రంలో రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన భక్తితో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు నరాల సుధాకర్, కొయ్యాడ శంకర్ తదితరులు పాల్గొన్నారు.