అక్షరటుడే, లింగంపేట: lingampet | జల్సాలు అలవాటు పడి.. డబ్బుల కోసం వరిధాన్యం దొంగలిస్తున్న ఓ వ్యక్తిని రైతులు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటన లింగంపేట మండలంలో (Lingampeta mandal) సోమవారం చోటు చేసుకుంది.
ఎస్సై దీపక్ కుమార్ (Sub-Inspector Deepak Kumar) తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం పెద్దరెడ్డి గ్రామానికి చెందిన దాసరి రాములు (30) జల్సాలకు అలవాటుపడ్డాడు. అక్రమంగా డబ్బు సంపాదించే క్రమంలో ధాన్యం దొంగలించాలని నిర్ణయించుకున్నాడు. లింగంపేట మండలంలోని లింగంపల్లి (ఖుర్డు) గ్రామ శివారులో ఉన్న నల్లమడుగు గాంధారి రహదారిపై ఉన్న వరి ధాన్యం కుప్పలో నుండి సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ధాన్యం చోరీ చేస్తుండగా గమనించిన రైతులు పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పజెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
