Homeజిల్లాలుకామారెడ్డిPaddy Center | కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత తీర్చాలి

Paddy Center | కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత తీర్చాలి

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్​:Paddy Center | కొనుగోలు కేంద్రాల్లో హమాలీ(Porters)ల కొరత తీర్చాలని రైతులు కోరారు. వడ్డేపల్లి రైతులు(Farmers) మండలంలోని తహశీల్దార్​ కార్యలయం(Tahsildar Office)లో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రం(Purchasing Centers)లో హామాలీల కొరత కారణంగా కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని తహశీల్దార్​ భిక్షపతి(Tahsildar Bikshapati)ని వారు కోరారు. కేంద్రంలో సమస్యలపై ఏపీఎంకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.