అక్షరటుడే, బోధన్ : Bodhan | పట్టణంలోని పురాణే(పౌడయ్య) మఠం ఆధ్వార్యంలో కపిల ధార్ మన్మథ స్వామి పుణ్యక్షేత్రానికి పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం యాత్రకు సంబంధించిన పోస్టర్లను రాష్ట్ర వీరశైవ లింగాయత్ నమాజ్ ప్రతినిధి, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు దేశాయ్ ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. వీరశైవ లింగాయత్ సౌజన్యంతో 16వ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్తీక మాసం(Karthika Masam)లో అక్టోబర్ 23న బోధన్ పట్టణంలోని చక్రేశ్వర శివమందిరం(Chakraswara Shiva Temple) నుంచి పాదయాత్రా ప్రారంభమవుతుందన్నారు. ఈ యాత్ర నవంబర్ 5న కార్తీక పౌర్ణమి నాటికి 15 రోజుల పాటు సాగుతుందని వెల్లడించారు.
భక్తులు భజనలతో, కీర్తనలతో పాల్గొని మహారాష్ట్ర బీడ్ జిల్లా మంజర్ సుంభా గ్రామంలోని కపిలధార జలపాతం(Kapiladhara Falls)లో పుణ్యస్నానం చేసి, మన్మథ స్వామి జిత్త స్మారక దర్శనంతో యాత్ర ముగుస్తుందని ఆయన వివరించారు. బోధన్(Bodhan) పట్టణంలో ఈనెల 23వ తేదీన ప్రారంభమై సుంకిని గ్రామం వరకు సాగే ఈ యాత్రకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ లింగాయత్ సమాజ నాయకులు నర్సింగ్ అప్పా, లక్ష్మణ్ పటేల్, మఠం నిర్వాహకులు పురాణే అజయ్ కుమార్, పౌడయ్య రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.