అక్షరటుడే, వెబ్డెస్క్: PACS | రాష్ట్ర ప్రభుత్వం (state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (Primary Agricultural Cooperative Societies) ఛైర్మన్లు, డైరెక్టర్ల పాలక వర్గాలు రద్దు చేసింది.
గత ఆగస్టు 14న ముగిసిన వీరి పదవీ కాలం ముగిసింది. అయినా ప్రభుత్వం పొడిగించి పాలన సాగిస్తోంది. తాజా పాలకవర్గాలను రద్దు చేసింది. అంతేగాకుంఆ తొమ్మిది జిల్లాల డీసీసీబీలను (District Cooperative Central Banks) తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేసింది. ఎన్నికల ద్వారా వీటి పాలకవర్గాలను ఎన్నుకుంటారు. 2020 ఫిబ్రవరి 13న సొసైటీల ఎన్నికలు జరిగాయి. వారి పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది.
PACS | ఆగస్టు 14తోనే..
దీంతో ప్రభుత్వం ఆరు నెలల పాటు పొడిగించింది. పొడిగించిన పదవీకాలం కూడా ఆగస్టు 14 తో ముగిసింది. మళ్లీ పొడిగింపు ఉత్తర్వులు జారీ చేయలేదు. అయినా కూడా పాత పాలకవర్గాలే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం పాలకవర్గాలను రద్దు చేసింది. ఆగష్టు 14నే వీరి పదవీకాలం ముగిసినట్లు పేర్కొంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వీటికి కూడా త్వరలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.