HomeUncategorizedOyo food sector | విస్త‌ర‌ణ దిశ‌గా ఓయో అడుగులు.. ఆహార రంగంలోకి ప్ర‌వేశం

Oyo food sector | విస్త‌ర‌ణ దిశ‌గా ఓయో అడుగులు.. ఆహార రంగంలోకి ప్ర‌వేశం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oyo food sector | ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ ఓయో hospitality company oyo విస్త‌ర‌ణ దిశ‌గా అడుగులు వేస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఫుడ్ అండ్ బివరేజ్ food and beverage sector రంగంలోకి అడుగుపెట్టింది. తమ సొంత హోటళ్లలో ఇన్ హౌస్‌ కిచెన్లతో in-house kitchens పాటు క్విక్ సర్వీస్ రెస్టారెంట్ restaurant కార్ట్స్ ఏర్పాటు చేయనున్న‌ట్లు ఆ సంస్థ ప్రకటించింది. మెట్రోతో metro పాటు అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఓయోకు హోట‌ళ్లు oyo hotels ఉన్నాయి. అతి త‌క్కువ రుసుముతో సేవ‌లందిస్తున్న‌ ఓయో త‌క్కువ స‌మ‌యంలోనే క‌స్ట‌మ‌ర్ల ఆద‌ర‌ణ పొందింది. “కిచెన్ సర్వీసెస్” kitchen service అనే పేరుతో ఓయో యాప్ , వెబ్‌సైట్ website ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. హోటల్ లోపల ఏర్పాటు చేసి కిచెన్ ద్వారానే క‌స్ట‌మ‌ర్ల‌కు అందించ‌నున్నారు.

Oyo food sector | తొలి విడుత‌లో 1500 హోట‌ళ్ల‌లో..

భారీ విస్త‌ర‌ణ‌కు ప్ర‌ణాళిక‌లు రూపొందించిన ఓయో.. తొలి విడుత‌లో 1500 హోట‌ళ్ల‌లో ఆహార సేవ‌లు అందించ‌నుంది. ఢిల్లీ Delhi, గురుగ్రామ్ Gurugram, హైదరాబాద్ Hyderabad, బెంగళూరు Bengaluru వంటి నగరాల్లో 100 హోటళ్లలో పైలట్ ప్రోగ్రామ్‌గా pilot program ఈ సేవ‌ల‌ను ప్రారంభించ‌గా విజయవంతమైంది. దీంతో దేశవ్యాప్తంగా విస్త‌ర‌ణ అమలు చేయాలని నిర్ణయించారు. “టౌన్హౌస్ కేఫే” Townhouse Cafe అనే పేరుతో ఓయో ప్రత్యేక QSR కియాస్కులు ఏర్పాటు చేయ‌నుంది. 2025–26 సంవత్సరంలో 1,500 హోటళ్లలో ఈ కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ సేవల ద్వారా అదనంగా 5–10% ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్న‌ట్లు ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ Ritesh Agarwal తెలిపారు. ఓయో ఇప్పుడు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, పుణె, ఇండోర్, కోల్కతా, జైపూర్, లక్నో వంటి ప్రధాన నగరాల్లో major cities నిపుణులను ఏర్పాటు చేస్తోంది. తద్వారా తమ కొత్త ఫుడ్ అండ్ బెవ‌రేజ్‌ సేవల నెట్‌వ‌ర్క్‌ను food and beverage services network మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓయో విస్త‌ర‌ణ ఏ విధంగా విజ‌య‌వంత‌మవుతుందో చూడాలి.

Must Read
Related News