ePaper
More
    HomeజాతీయంOYO Hotel | పెళ్లైన యువతి.. పెళ్లికాని ప్రసాదు.. మధ్యలో ఓయో రూం.. సీన్​ కట్​...

    OYO Hotel | పెళ్లైన యువతి.. పెళ్లికాని ప్రసాదు.. మధ్యలో ఓయో రూం.. సీన్​ కట్​ చేస్తే..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: OYO Hotel : హాండ్​సమ్​ భర్త (Handsome husband).. అందమైన జీవితం(Beautiful life).. వీకెండ్​ పార్టీలు.. సరదా షికార్లు.. ఓ భార్యకు ఇంతకంటే ఏం కావాలి..? కానీ, ఆ యువతికి ఇవి సరిపోలేదు. పరాయి పురుషుడి మోజులో పడిపోయింది. అమాయక భర్తను నిలువునా మోసం చేసింది. చివరికి దారుణ హత్యకు గురైంది.

    బెంగళూరు(Bengaluru)లోని కెంగేరి(Kengeri)కి చెందిన హరిణికి కొన్నేళ్ల క్రితం దాసేగౌడ అనే యువకుడితో వివాహమైంది. దంపతులిద్దరూ కెంగేరిలోనే ఉండేవారు. కొద్దిరోజుల క్రితం స్థానికంగా జరిగిన జాతరకు వెళ్లింది హరిణి. అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యశస్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరి ఫోన్‌ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. చాటింగ్​, కాలింగ్​ కాస్త వివాహేతర సంబంధం వరకు వెళ్లింది. ఆ తర్వాత హరిణి వింత వ్యవహారంపై భర్త దాసేగౌడకు అనుమానం రావడంతో.. ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. దీంతో ఆమెను మందలించి, ఫోన్​ లాగేసుకున్నాడు. తర్వాత హరిణి – ఆమె లవర్ యశస్‌ మధ్య కమ్యూనికేషన్ (communication) దెబ్బతింది.

    కానీ, తన తప్పుని తెలుసుకున్నానని భర్త దగ్గర కన్నీరుపెట్టుకుని క్షమించమని కోరడంతో ఆ అమాయక భర్త కరిగిపోయి ఫోన్ ఇచ్చేశాడు. అలా హరిణికి మళ్లీ యశస్ లైన్​లోకి రావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఈ క్రమంలో ఓ రోజు మాట్లాడాలంటూ హరిణిని యశస్‌ ఓయో హోటల్‌(OYO Hotel )కి పిలిపించాడు. ఇద్దరూ కలిసి చాలాసేపు గడిపారు. ఇదిలా ఉంటే.. తనతో ఉండిపోవాలని యశస్‌ పట్టుబట్టాడు. అందుకు హరిణి అంగీకరించలేదు. ఎంత వెంటపడ్డా ఒప్పుకోకపోవడంతో ఆగ్రహంతో ఆమెని కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన హరిణి అక్కడికక్కడే మరణించింది.

    సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు యశస్‌ను అరెస్టు చేశారు. అందమైన జీవితాన్ని చేజేతులారా అగాథంలోకి నెట్టివేసుకుంది హరిణి. క్షమించిన భర్తతో సంతోషంగా ఉండాల్సింది పోయి, పరాయి వ్యక్తి మోజులో పడి దారుణంగా ప్రాణాలు పోగొట్టుకుంది.

    Latest articles

    KCR | తెలంగాణను ధాన్యాగారంగా మార్చిన కేసీఆర్ కు కారాగారమా? : జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: KCR : తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర...

    Ration Rice | 32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

    అక్షరటుడే, గాంధారి: Ration Rice | ఉచిత రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై...

    SI Sunil | సైబర్​ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, కోటగిరి: SI Sunil | ప్రజలు సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సునీల్ సూచించారు....

    BRS | బీఆర్​ఎస్​కు మరో షాక్.. పార్టీని వీడనున్న 10 మంది మాజీ ఎమ్మెల్యేలు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS | బీఆర్​ఎస్​ పార్టీకి మరో షాక్​ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పది మంది...

    More like this