అక్షరటుడే, ఇందూరు: Private Degree Colleges | తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) పరిధిలోని ప్రైవేటు కాలేజీల నూతన కార్యవర్గం ఇటీవల ఏర్పాటైంది.
ఈ సందర్భంగా శనివారం పీసీసీ చీఫ్ బొమ్మ (PCC Chief Bomma) మహేశ్ కుమార్ గౌడ్‌ను నూతన కార్యవర్గ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్, కోశాధికారి శ్రీనివాస్ రాజు, ఉపాధ్యక్షులు అరుణ్ రెడ్డి, హకీం తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను ఘనంగా సన్మానించారు.
అనంతరం పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కళాశాలల సమస్యలపై ఎప్పుడైనా తనను కలవొచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ సూర్యప్రకాశ్ రెడ్డి, దత్తు, గిరి, అనిల్, దేవారెడ్డి, శంకర్, రాజేశ్వర్, నవీన్, షకీల్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.