313
అక్షరటుడే, వెబ్డెస్క్ : Terror Attack | జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ pahalgamలో ఉగ్రవాదులు పర్యాటకులను కాల్చి చంపిన ఘటనను యావత్ దేశం ఖండించింది. ఎంఐఎం mim అధినేత అసదుద్దీన్ ఒవైసీ Asaduddin Owaisi కూడా ఉగ్రవాదుల దాడిని ఖండించారు. ఇది పాకిస్తాన్ పని అని ఆయన ఆరోపించారు. ఉగ్రదాడికి నిరసనగా ముస్లింలకు ఆయన కీలక పిలుపు ఇచ్చారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ముస్లింలంతా నల్లరిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని ఆయన సూచించారు.