అక్షరటుడే, గాంధారి: Heavy rains | జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. గాంధారిలోని (gandhari) బూర్గుల్ వాగు బ్రిడ్జిపై (Burgul Vagu Bridge) నుండి ఉప్పొంగి ప్రవహించడంతో గ్రామపంచాయతీ అధికారులు వెంటనే స్పందించి ట్రాక్టర్ను అడ్డుగా పెట్టి రాకపోకలను నిలిపివేశారు.
Heavy rains | కాటేవాడి తండాలో పొంగిపొర్లుతున్న వాగు
గాంధారిలోని నాగులూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కాటేవాడి తండాలో (Katewadi thanda) వంతెనపై నుండి నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇటుపై రవాణా సౌకర్యం లేకపోయినప్పటికీ రైతులు తమ పనులు ముగించుకుని ప్రమాదకరంగా ఉన్న వంతెనను దాటుతున్నారు. లోలెవల్ వంతెన కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని హైలెవల్ వంతెన కోసం గ్రామస్థులు కొన్నేళ్లుగా ప్రజాప్రతినిధులను, అధికారులను వేడుకుంటున్నారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు.
Heavy rains | ఉధృతంగా పారుతున్న లింగంపేట వాగు
అక్షరటుడే, లింగంపేట: వర్షాకాలం మొదలైనప్పటినుండి రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లింగంపేట వాగు శనివారం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాలైన గాంధారిలో వర్షం కురుస్తుండడంతో లింగంపేట (Lingampet) వాగు వరద పోటెత్తి ఉధృతంగా పారుతుంది. పోచారం జలాశయంలోకి (Pocharam Reservoir) కొత్తనీరు చేరుతున్నంటో పోచారం నీటిమట్టం పెరుగుతుంది. దీంతో పోచారం ఆయకట్టు ప్రజలు సంబరపడ్డారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న లింగంపేట వాగు