ePaper
More
    HomeతెలంగాణHeavy Rains | ఉప్పొంగి పారుతున్న వాగులు.. జలాశయాలకు పోటెత్తిన వరద

    Heavy Rains | ఉప్పొంగి పారుతున్న వాగులు.. జలాశయాలకు పోటెత్తిన వరద

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉధృతంగా పారుతున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాల్లో చెరువులు నిండుకుండల్లా మారాయి. కొన్ని చెరువులు అలుగు పారుతున్నాయి.

    ఎగువ నుంచి కృష్ణానది (Krishna River)కి వరద కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్ట్ (Jurala Project)​ నుంచి పులిచింతల వరకు అన్ని ప్రాజెక్ట్​ల గేట్లు తెరిచి ఉంచారు. వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ (Nagarjuna Sagar)​ 26 ఎత్తారు. ఎగువ నుంచి వదర కొనసాగుతుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 70 గేట్లు ఎత్తి 5.19 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.

    Heavy Rains | హిమాయత్​సాగర్​ గేట్లు ఎత్తివేత

    హైదరాబాద్​ నగరానికి తాగునీరు అందించే హిమాయత్​ సాగర్​ (Himayat Sagar)కు భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 17,500 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. 7,926 క్యూసెక్కులు మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం పెరిగితే నీటి విడుదలను పెంచనున్నారు. దీంతో హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని మూసీ పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

    Heavy Rains | కుమురం భీమ్​ ప్రాజెక్ట్​కు..

    ఆసిఫాబాద్​ జిల్లాలోని కుమురం భీమ్​ ప్రాజెక్ట్ (Kumuram Bheem Project)​కు భారీగా ఇన్​ఫ్లో వస్తోంది. ప్రస్తుతం 8,333 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. ఐదు గేట్లు ఎత్తి 21,254 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 243 అడుగులు కాగా.. ప్రస్తుతం 237 అడుగులకు చేరింది. కాగా ఈ ప్రాజెక్ట్​ ఆనకట్ట నాలుగేళ్ల క్రితం కుంగిపోయింది. దీంతో అధికారులు కవర్లు కప్పి కాలం నెట్టుకొస్తున్నారు. మరమ్మతులు చేపట్టకపోవడంతో భారీగా వరద వస్తే కట్ట కొట్టుకుపోయే అవకాశం ఉంది. ప్రాజెక్ట్​ నిండకుండా ముందుగానే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

    Heavy Rains | నిలిచిన రాకపోకలు

    భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు ఉధృతంగా పారుతున్నాయి. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా బండమీదపల్లిలో రైల్వే అండర్‌బ్రిడ్జి సైడ్‌ రైలింగ్ కూలిపోయింది. హైదరాబాద్-కర్నూలు మధ్య రాకపోకలకు అంతరాయం క​లిగింది.

    జడ్చర్లలో నల్లచెరువు అలుగు పారుతుండటంతో ఆ నీరు హైవేపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో మహబూబ్‌నగర్‌-హైదరాబాద్ రాకపోకలపై ప్రభావం పడింది. నాగర్​ కర్నూల్​ జల్లా దుందుభి వాగు తీవ్ర రూపం దాల్చడంతో సిరసవాడ-జడ్చర్ల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. మహబూబ్ నగర్ దివిటిపల్లి వద్ద 44వ జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో అందులో అమరరాజా కంపెనీకి చెందిన మినీ బస్సు దిగబడింది. బస్సులోని సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి.

    Latest articles

    Rainy Season | వ‌ర్షాకాలం.. ఆరోగ్యం భ‌ద్రం.. వ్యాధుల నుంచి ర‌క్షించుకోవ‌డం సుల‌భం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rainy Season | కాలాలు మారుతున్న త‌రుణంలో వాతావ‌ర‌ణంలో అనేక మార్పులు వ‌స్తాయి. ఈ...

    SriramSagar Project | క్రమంగా పెరుగుతున్న శ్రీరాంసాగర్​ నీటిమట్టం

    అక్షరటుడే, ఆర్మూర్: SriramSagar Project | తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ కురుస్తున్న...

    Nizamabad Urban MLA | సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Urban MLA | సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ శాసనసభ్యుడు ధన్​పాల్...

    Heavy Rains | దేశ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు.. స్తంభించిన జ‌న‌జీవ‌నం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | దేశ‌వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఉత్త‌రాది రాష్ట్రాలు వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మ‌వుతున్నాయి....

    More like this

    Rainy Season | వ‌ర్షాకాలం.. ఆరోగ్యం భ‌ద్రం.. వ్యాధుల నుంచి ర‌క్షించుకోవ‌డం సుల‌భం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rainy Season | కాలాలు మారుతున్న త‌రుణంలో వాతావ‌ర‌ణంలో అనేక మార్పులు వ‌స్తాయి. ఈ...

    SriramSagar Project | క్రమంగా పెరుగుతున్న శ్రీరాంసాగర్​ నీటిమట్టం

    అక్షరటుడే, ఆర్మూర్: SriramSagar Project | తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ కురుస్తున్న...

    Nizamabad Urban MLA | సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Urban MLA | సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ శాసనసభ్యుడు ధన్​పాల్...