అక్షరటుడే, హైదరాబాద్: Outer Ring Road | రంగారెడ్డి జిల్లా Rangareddy district నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం సంభవించింది. ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగడం గమనించిన డ్రైవరు Driver ఆ కారుని తక్షణమే నడి రోడ్డుపై ఆపాడు.
ఆ సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. డ్రైవరు అప్రమత్తతో ముగ్గురు వ్యక్తులు వెంటనే కారు దిగారు. వారు కారు దిగిన తర్వాత కారు మొత్తం పూర్తిగా కాలిపోయింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అయితే, అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైపోయింది.
Outer Ring Road | పూర్తిగా కాలిన కారు..
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అప్రమత్తత వలన ముగ్గురు వ్యక్తులు సేఫ్‌గా బయటపడ్డారని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ ఘటన కారణంగా ఔటర్ రింగ్ రోడ్‌లో ట్రాఫిక్ భారీగా నిలిచింది. పోలీసులు వెంటనే ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, కారు శిథిలాలను తొలగించారు.
ఇలాంటి ప్రమాదమే రెండు రోజుల క్రితం కర్నూల్‌లో Kurnool జరిగిన విషయం తెలిసిందే. “వీ కావేరీ ట్రావెల్స్” బస్సులో మంటలు చెలరేగి 19 మంది సజీవ దహనమయ్యారు.
శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో, హైదరాబాద్ Hyderabad నుంచి బెంగళూరు Bangalore వెళ్తున్న వీ-కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు ఒక మోటారు సైకిల్‌ను ఢీ కొట్టింది. ఆ సమయంలో బస్సు ఫ్యూయల్ ట్యాంక్ పగిలి క్షణాల్లో మంటల్లో అంటుకున్నాయి.
ప్రమాద సమయంలో రెండో డ్రైవరు శివనారాయణ నిద్ర నుంచి లేచి మూసివేయబడిన బస్సు కిటికీలను రాడ్‌తో పగలగొట్టి, లోపల ఉన్న ప్రయాణికులను Passengers బయటకు లాగారు.
అయితే ఈ మధ్య ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలతో స్థానిక రోడ్ల భద్రత, వాహన నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
