ePaper
More
    Homeఅంతర్జాతీయంAmerica | భారత్‌ను చైనాకు దూరం చేయడమే మా ప్రాధాన్యం.. అమెరికా కీలక వ్యాఖ్యలు

    America | భారత్‌ను చైనాకు దూరం చేయడమే మా ప్రాధాన్యం.. అమెరికా కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : America | సుంకాలతో భారత్​ను భయపెట్టాలని చూసిన అమెరికా వెనక్కి తగ్గింది. భారత దౌత్య నీతి ముందు అగ్రరాజ్యం బెదిరింపులు పని చేయలేదు.

    రష్యా (Russia) నుంచి ఆయిల్​, ఆయుధాలు కొనుగోలు చేస్తుందనే కారణంతో డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump)​ భారత్​పై 50శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం అమెరికా చర్యలకు ఏ మాత్రం వెరవకుండా.. రష్యాతో బంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేసింది. అంతేగాకుండా చైనా(China)తో కూడా సంబంధాలను పునరుద్ధరించింది. దీంతో భారత్​, రష్యా, చైనా మూడు దేశాలు కలిస్తే తమకు ప్రమాదం అని భావించిన అమెరికా వెనక్కి తగ్గింది. ఈ మేరకు భారత్​తో చర్చలకు సిద్ధమని ఇటీవల ట్రంప్​ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా భారత్‌-అమెరికా మధ్య సంబంధాలపై అమెరికా రాయబారి సెర్గీ గోర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

    America | యూఎస్​కు దగ్గర చేసుకుంటాం

    భారత్​–అమెరికా సంబంధాలపై భారత్‌కు కాబోయే అమెరికా రాయబారి సెర్గీ గోర్‌ (Sergey Gore) మాట్లాడారు. భారత్​ను చైనాకు దూరం చేసి, అమెరికాకు దగ్గర చేయడమే తమ ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. ఇండియాను యూఎస్​ వైపు తీసుకు రావడం ముఖ్యమైన విషయమని చెప్పారు. తమ పెట్రోలియం ఉత్పత్తుల కోసం భారత్​ ప్రధాన మార్కెట్​ కావాలని చూస్తున్నట్లు చెప్పారు. అయితే రష్యా తక్కువ ధరకు ముడి చమురు సరఫరా చేస్తుండటంతో భారత్​ అక్కడి నుంచి కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే.

    ఇరుదేశాల మధ్య చర్చలతో అడ్డంకులు తొలగిపోతాయని గోర్గ్​ ఆశాభావం వ్యక్తం చేశారు. చైనాతో కంటే అమెరికాతోనే భారత్​కు గొప్ప స్నేహం ఉందని చెప్పారు. భారత వాణిజ్యశాఖ మంత్రి పియూష్​ గోయల్​, ప్రతినిధులను చర్చల కోసం ట్రంప్​ అమెరికాకు ఆహ్వానించారన్నారు. ఈ చర్చల్లో కీలక ఒప్పందాలు జరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

    America | భారత్​కు ట్రంప్​..

    డోనాల్డ్​ ట్రంప్​ త్వరలో భారత్​లో పర్యటించనున్నట్లు సమాచారం. నవంబర్​లో ఇండియాలో జరిగే క్వాడ్ స‌ద‌స్సుకు ఆయ‌న హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంద‌ని సెర్గియో గోర్ వెల్ల‌డించారు. అయితే పర్యటనకు సంబంధించి చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. కాగా ఓ వైపు చర్చలు అంటూనే అమెరికా భారత్​పై సుంకాలు విధించాలని జీ7 దేశాలపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం విషయంలో ఒత్తిడి తీసుకు రావడానికి భారత్​, చైనాలపై 50 నుంచి 100శాతం సుంకాలు విధించాలని అమెరికా ఆయా దేశాలను కోరినట్లు సమాచారం.

    More like this

    Gold Price | చుక్కలు చూపిస్తున్న బంగారం ధర.. 10 గ్రాములకు రూ. 1.14 లక్షలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Price | బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజుకో రికార్డు సృష్టిస్తూ పైపైకి...

    Bomb Threat | ఢిల్లీ, బాంబే హైకోర్టులకు బాంబు బెదిరింపులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bomb Threat | బాంబు బెదిరింపు ఈమెయిల్స్ కారణంగా అత్యవసరంగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి...

    Yellareddy | కొట్టుకుపోయిన రైతుల కష్టం.. మళ్లీ తెగిన చెరువు కట్ట

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | చెరువు కట్ట తెగిపోయిందని.. ఫీడర్​ కాల్వలు కొట్టుకుపోయాయని మరమ్మతులు చేయాలని రైతులు గగ్గోలు...