అక్షరటుడే, వెబ్డెస్క్: Pakistan nuclear weapons | భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత పాకిస్తాన్ అణ్వస్త్ర కేంద్రాలు భారీగా దెబ్బ తిన్నాయన్న వార్తలు వచ్చాయి. పాక్‌కు చెందిన అణ్వాయుధ కేంద్రాలతో పాటు కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ధ్వంసమయ్యాయని ప్రచారం జరిగింది. అయితే, వాటన్నింటినీ కొట్టి పడేస్తూ తమ అణ్వాయుధాలు భద్రంగా ఉన్నాయని పాకిస్తాన్(Pakistan) తాజాగా ప్రకటించింది. తన కమాండ్ కంట్రోల్ నిర్మాణాలు బలంగా ఉన్నాయని తెలిపింది. తన సమగ్ర అణు భద్రతా పాలన బలంపై దేశం పూర్తిగా నమ్మకంగా ఉందని విదేశాంగ కార్యాలయం తెలిపింది. పాకిస్తాన్ అణ్వాయుధాలకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆ దేశ విదేశాంగ శాఖ ఈ మేరకు స్పందించింది. “పాకిస్తాన్ తన సమగ్ర అణు భద్రతా పాలన బలం, దాని కమాండ్ అండ్ కంట్రోల్ నిర్మాణాల దృఢత్వంపై పూర్తిగా నమ్మకంగా ఉంది” అని సమాధానంగా విదేశాంగ కార్యాలయం తెలిపింది.
Pakistan nuclear weapons | ఇండియాపై అక్కసు..
తన అణ్వాయుధాలు భద్రంగా ఉన్నాయన్న పాకిస్తాన్.. మరోసారి భారత్(Bharath)పై అక్కసు వెల్లగక్కింది. భారతదేశ అణ్వాయుధాల గురించి అంతర్జాతీయ సమాజం మరింత ఆందోళన చెందాల్సి ఉందని వ్యాఖ్యానించింది. భారతదేశ రాజకీయ చిత్రం, మీడియా, దాని సమాజంలోని విభాగాల్లో పెరుగుతున్న రాడికలైజేషన్ చట్టబద్ధమైన అణు భద్రతా ఆందోళనలను లేవనెత్తుతుందని వ్యాఖ్యానించింది. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పాక్ ఇలాంటి దిగజారిన వ్యాఖ్యలు చేస్తోందన్నది స్పష్టమవుతూనే ఉంది.