అక్షరటుడే, ముప్కాల్: Wine Shop | వైన్స్ కారణంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని.. తక్షణమే దానిని తరలించాలని ముప్కాల్ మండలం (Mupkal mandal) రెంజర్ల గ్రామంలో పలువురు నిరసన తెలిపారు. వైన్స్ (liquor shop) కారణంగా అంగడిలో ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొంటూ మంగళవారం దళిత, మైనారిటీ, ఇందిరాకాలనీ వాసులు ఆందోళనకు దిగారు.
Wine Shop | వైన్స్ కారణంగా అందరికీ ఇబ్బందులు..
ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. అంగడిలో వైన్స్ షాపు ఉండడంతో ముఖ్యంగా మహిళలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. వైన్స్ పక్కనే పాఠశాల ఉందని.. అలాగే ఆస్పత్రి కూడా ఉందన్నారు. ఆస్పత్రికి నిత్యం గర్భిణులు, బాలింతలు వస్తుంటారని.. మందుబాబుల కారణంగా వారు అవస్థలు పడుతున్నారని వివరించారు. అంగడిలో కాకుండా వైన్స్‌ను ఎక్కడైనా ఏర్పాటు చేయాలని గతంలోనూ చెప్పామని.. కానీ అంగడిలో దుకాణం ఏర్పాటు చేసి అందరికీ ఇబ్బందులు కలిగిస్తున్నారన్నారు. ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేశామని వారు పేర్కొన్నారు. తక్షణమే వైన్స్‌ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, మైనారిటీ,ఇందిరా కాలనీ ప్రజలు పాల్గొన్నారు.