అక్షరటుడే, వెబ్‌డెస్క్: Eight MPs suspended | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో (budget session) మంగళవారం గందరగోళం నెలకొంది. విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. స్పీకర్ ముందున్న టేబుల్ ఎక్కి నిరసన తెలిపారు.
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం సభలో మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే (Army Chief M.M. Naravane) ప్రచురించని భారతదేశం-చైనా సంఘర్షణకు సంబంధించిన పుస్తకం నుంచి పలు వాక్యాలు ఊటంకించిన విషయం తెలిసిందే. దానిపై కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి రాహుల్ ఆ పుస్తకం గురించి ప్రస్తవించగా.. అధికార పక్షం అడ్డుకుంది. ఆయన తన ప్రసంగాన్ని పూర్తి చేయకముందే ఇతర సభ్యులను మాట్లాడటానికి స్పీకర్ పిలిచారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు.
Eight MPs suspended | స్పీకర్ పేపర్లు విసరడంతో..
విషయం నుంచి పక్కకు తప్పుకోకుండా రాష్ట్రపతి ప్రసంగంపైనే మాట్లాడాలని స్పీకర్ కోరారు. అయితే ఆయన భారత్–చైనా (India-China) మధ్య సంఘర్షణ ఉందన్నారు. అనంతరం ప్రతిపక్షాల వైపు నుంచి ఎవరూ మాట్లాడకపోవడంతో, అతను ఎన్డీఏ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీని పిలిచారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు నిరసనలను తీవ్రతరం చేశారు. ప్యానెల్ స్పీకర్‌పైకి పేపర్లు విసిరారు. పేపర్లు విసిరిన 8 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ సెషన్ ముగిసేవరకూ లోక్‌సభ నుంచి వారిని సస్పెండ్ చేశారు. వారిలో తెలంగాణ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి సైతం ఉన్నారు. సదరు సభ్యులు కాగితాలను చింపి, వాటిని సభాపతి వైపు విసరడంతో పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజ్ వారిని సస్పెండ్ చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.అనంతరం లోక్‌సభను స్పీకర్ వాయిదా వేశారు.