HomeజాతీయంParliament Sessions | పార్లమెంట్​లో విపక్షాల ఆందోళన.. ‘సర్’ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​​

Parliament Sessions | పార్లమెంట్​లో విపక్షాల ఆందోళన.. ‘సర్’ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​​

పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు వాడీవేడిగా మొదలయ్యాయి. SIR ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని విపక్షలు ఆందోళన చేపట్టడంతో సభ వాయిదా పడింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Parliament Sessions | పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు వాడీవేడిగా మొదలయ్యాయి. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) కు ప్రధాని అభినందనలు తెలిపారు. పెద్దల సభ గౌరవాన్ని కాపాడేలా సభ్యులు వ్యవహరించాలని సూచించారు.

సభ ప్రారంభం అయిన అంనతరం విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో లోక్​సభ స్పీకర్​ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం మళ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాక.. విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించడంతో మరోసారి మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. SIR ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఈ విషయంపై పూర్తి పార్లమెంటరీ చర్చకు పిలుపునివ్వాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్​ చేస్తున్నారు. ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేయడంతో పాటు, SIR ఎలక్టోరల్ రోల్స్‌పై చర్చ కోసం ఒత్తిడి చేశారు. వాయు కాలుష్యం, ఇటీవలి భద్రతా సంఘటనలు మరియు ఇతర జాతీయ సమస్యలపై కూడా ఆందోళనలు వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడటంతో స్పీకర్​ వాయిదా వేశారు.

Parliament Sessions | కేంద్ర మంత్రి విమర్శలు

పార్లమెంట్​ సమావేశాలకు విపక్షాలు అంతరాయం కల్పించడంపై కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ (Union Minister Chirag Paswan) విమర్శించారు. మొదటిసారి ఎంపీలుగా ఎన్నికైన వారు మాట్లాడే అవకాశం కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్, చర్చలు ఇతర పార్లమెంటరీ కార్యకలాపాలు ఎంపీలు తమ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి చాలా ముఖ్యమైనవని ఆయన చెప్పారు. మొదటిసారి సభకు వచ్చిన వారి నుంచి అవకాశాన్ని లాక్కుంటున్నారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సమావేశాలకు అంతరాయం కలిగించొద్దన్నారు.

Parliament Sessions | కుక్కతో వచ్చిన రేణుకా చౌదరి

కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి (MP Renuka Chowdhury) పెంపుడు కుక్కను పార్లమెంటుకు తీసుకు వచ్చారు. ఇది వివాదానికి దారితీసింది. ఈ సంఘటన గురించి అడిగినప్పుడు, చౌదరి ఆందోళనలను తోసిపుచ్చారు. కుక్క హానిచేయదని, చిన్న జీవి అన్నారు. ‘‘ప్రభుత్వం సభ లోపలకు జంతువులను అనుమతించకపోవచ్చు. కానీ సమస్య ఏమిటి అని అన్నారు. అది ఎవరినీ కరవదని చెప్పారు. పార్లమెంట్​ లోపల కొంతమంది కరిచే వ్యక్తులు ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు.

Parliament Sessions | ప్రియాంక గాంధీ ఆగ్రహం

విపక్షాలు బీహార్ ఓటమితో నిరాశలో ఉన్నాయని ప్రధాని మోదీ (Prime Minister Modi) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. బీహార్ వైఫల్యానికి పార్లమెంట్ను వేదికగా చేసుకోవద్దన్నారు. ప్రధాని వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు ప్రస్తావించడం డ్రామానా అని ప్రశ్నించారు. కీలకమైన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలాన్నారు.

Must Read
Related News