అక్షరటుడే, వెబ్‌డెస్క్: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ (Smart Phone) తయారీ కంపెనీ అయిన ఒప్పో మిడ్ రేంజ్‌లో అదిరిపోయే ఫీచర్లతో మరో మోడల్‌ను తీసుకువచ్చింది. భారీ బ్యాటరీ దీని ప్రత్యేకత. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు అమెజాన్‌లోనూ అందుబాటులో ఉంది. ఒప్పో ఏ6 ప్రొ 5జీ పేరుతో తీసుకువచ్చిన ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
డిస్‌ప్లే : 6.75 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్‌ప్లేతో తీసుకువచ్చారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1570 * 720 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది. ఐపీ 66, 68, 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్
ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అమర్చారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ OS 15 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. సూపర్ కూల్ వీసీ స్టిస్టమ్‌ను కలిగి ఉంది.
కెమెరా సెటప్ : వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ మోనో క్రోమ్ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ : 7000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. ఇది 80w సూపర్‌వూక్ ఫ్లాష్ చార్జింగ్‌ను, రివర్స్ వైర్డ్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
వేరియంట్స్, ధర : అరోరా గోల్డ్, క్యాపచినో బ్రౌన్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,999.
8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,999.
కార్డ్ ఆఫర్ : ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డులపై 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
అమెజాన్ (Amazon)లో అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్‌కార్డుపై 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది.