HomeUncategorizedOperation Sindoor | ‘ఆపరేషన్‌ సింధూర్‌’.. ప్రత్యక్షంగా పర్యవేక్షించిన మోదీ

Operation Sindoor | ‘ఆపరేషన్‌ సింధూర్‌’.. ప్రత్యక్షంగా పర్యవేక్షించిన మోదీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ‘ఆపరేషన్‌ సింధూర్‌’ పేరిట పీవోకే, పాకిస్తాన్​లోని ఉగ్రస్థావరాలపై భారత్​ మెరుపుదాడులు చేసింది. ఈ ఆపరేషన్​ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Narendra Modi) ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్లు సమాచారం. పాక్​లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను సైన్యం విరుచుకుపడింది.

కాగా.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్టు అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈకి సమాచారం అందించారు. భారత్‌ మెరుపుదాడుల నేపథ్యంలో పాక్‌ సైన్యం సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడింది. దీంతో సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వాయు రక్షణ వ్యవస్థ సన్నద్ధంగా ఉంది.