అక్షరటుడే, న్యూఢిల్లీ: Operation Sindoor lessons : ఆపరేషన్ సిందూర్.. పహల్గావ్ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత భారత్ చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్. పాక్(Pakisthan)లో ఉగ్రమూక(terrorist groups)ల ఏరివేతతో ప్రపంచ దేశాలను తనవైపు తిప్పుకొంది భారత్.
ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)ను భవిష్యత్తు తరాలను చేరాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం (central government) కీలక నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ను పాఠ్యాంశాలలో చేర్చింది.
Operation Sindoor lessons : మూడో తరగతి నుంచే..
సీబీఎస్సీ పాఠశాల(CBSE schools)ల్లో ఇకపై ఆపరేషన్ సిందూర్ పాఠ్యాంశంగా చేరింది. 3 నుంచి 12వ తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లో ఇకపై ఆపరేషన్ సిందూర్ ఒక పాఠంగా చదవాల్సి ఉంటుంది. ఈమేరకు ఎన్‌సీఈఆర్‌టీ అనుబంధ బోధనాంశంగా చేరింది.
Operation Sindoor lessons : రెండు మాడ్యూళ్ల రూపంలో..
ఆపరేషన్ సిందూర్ను రెండు మాడ్యూళ్ల రూపంలో ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) పాఠ్యాంశంగా జోడించింది. 3 నుంచి 8వ తరగతి వరకు ‘ఆపరేషన్ సిందూర్-ఒక వీర గాథ’ అనే మాడ్యూల్ వచ్చింది. 9 నుంచి 12వ తరగతి వరకు ‘ఆపరేషన్ సిందూర్- ఆత్మగౌరవం కోసం సాహసిక ఎదురు దాడి‘ అనే మాడ్యూల్ చేరింది.
మన దేశ పరాక్రమం గురించి విద్యార్థులకు చేయడం ద్వారా వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
దాయాది దేశం పాకిస్తాన్ మన దేశంపై జరిపిన ఉగ్రదాడి, ప్రతీకార చర్యగా మన దేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. తదితర పూర్తి వివరాలను పాఠ్యాంశాల్లో పొందుపర్చారు ఎన్‌సీఈఆర్‌టీ అధికారులు.