ePaper
More
    Homeఅంతర్జాతీయంOperation Sindoor | 25 నిమిషాల్లోనే ఖేల్ ఖ‌తం.. మొత్తం 9 చోట్ల 21 టార్గెట్...

    Operation Sindoor | 25 నిమిషాల్లోనే ఖేల్ ఖ‌తం.. మొత్తం 9 చోట్ల 21 టార్గెట్ ఫిక్స్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Sindoor | జమ్మూ కశ్మీర్‌లోని పహల్ గామ్‌ Pahalgamలో జరిగిన ఉగ్రదాడికి ప్ర‌తీకారంగా పాకిస్తాన్‌పై భారత సైన్యం(Indian Army) దాడులు జ‌రిపిన విష‌యం తెలిసిందే. ముందుగానే చెప్పి ప‌లు చోట్ల దాడులు చేసింది. అర్ధరాత్రి ఒంటిగంట 28 నిమిషాలకు దాడికి సిద్ధం.. గెలుపే లక్ష్యం అంటూ ఆర్మీ ట్వీట్ చేయ‌గా, ఒంటి గంట 51 నిమిషాల‌కు ఆపరేషన్‌ ముగిసాక న్యాయం జరిగింది. జై హింద్ అంటూ ఆర్మీ మరో ట్వీట్‌ చేసింది. ఈ పూర్తి ఆప‌రేష‌న్ మొత్తాన్ని భార‌త ప్ర‌ధాని మోదీ(Prime Minister Modi) స్వ‌యంగా వీక్షించారు. వార్ రూమ్ నుండే ఆయ‌న లైవ్‌లో వీక్షించిన‌ట్టు తెలుస్తుండ‌గా, ఆప‌రేష‌న్ సింధూర్‌(Operation Sindoor)లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ మెరుపు దాడిలో మొత్తం 9 టెర్రర్ కేంద్రాల‌ను ఇండియా టార్గెట్ చేసింది. కేవలం 25 నిమిషాల్లోనే ఆ ఉగ్రస్థావరాలపై 24 మిస్సైళ్లతో మెరుపు దాడి చేసి పాక్‌(Pakistan)ను ఉక్కిరిబిక్కిరి చేసేసింది.

    Operation Sindoor | ఇలా జ‌రిగింది..

    ఆపరేషన్ సింధూర్ పై సైన్యం విలేకరుల సమావేశం Press meet నిర్వహించింది. భారతదేశంపై జరిగిన ఉగ్రవాద దాడి వీడియోతో ప్రెస్ కాన్ఫరెన్స్(Press Conference) ప్రారంభమైంది. ఓ వీడియోను ప్ర‌ద‌ర్శించ‌గా, అందులో ప‌హ‌ల్ గామ్ దాడి(Pahalgam Attack)ని చూపించారు. అలానే దశాబ్ద కాలంలో 350 మంది భారతీయులు ఉగ్రవాద దాడుల్లో మరణించారని ఆ వీడియోలో వివరించారు. పాక్‌ ఉగ్రమూకలు లక్ష్యంగా ఆపరేషన్‌ సింధూర్‌ కొనసాగినట్లు సైన్యం చెప్పుకొచ్చింది. భార‌త్(India) మొత్తం తొమ్మిది స్థావ‌రాలు టార్గెట్ చేసింది. బ‌హ‌వ‌ల్‌పుర్‌.. జైషే ఈ మొహ‌మ్మద్ ప్రధాన కార్యాల‌యం, ముర్దిఖే.. ల‌ష్క‌రే తోయిబా బేస్ క్యాంపు.. శిక్ష‌ణ కేంద్రం, కోట్లీ.. బాంబ‌ర్ ట్రైనింగ్‌, టెర్ర‌ర్ లాంచ్ బేస్‌, గుల్‌పూర్‌, స‌వాయి, స‌ర్జ‌ల్‌, బ‌ర్నాలా, మెహ‌మూనా ఉగ్ర కేంద్రం, బిలాల్ క్యాంపు వీటిని టార్గెట్ చేశారు.

    శాటిలైట్‌ చిత్రాలతో దాడులను సైతం భారత్‌ వివరించింది. ఆపరేషన్(Operation Sindoor) గురించి పూర్తి సమాచారం అందించామని కల్నల్ సోఫియా ఖురేషి(Colonel Sophia Qureshi) తెలిపారు. పాకిస్తాన్ Pakistan పై తెల్లవారుజామున 1:05 గంటలకు దాడి జరిగిందని ఆమె తెలిపారు. ఈ ఆపరేషన్‌లో 9 చోట్ల దాడి జరిగింది. ఈ ఆపరేషన్ మధ్యాహ్నం 1.05 నుండి 1.30 వరకు కొనసాగింది. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా లక్ష్యంపై దాడి జరిగింది. పాకిస్తాన్ – పీవోకే రెండింటిపైనా దాడులు జరిగాయి. మేము పౌరులకు హాని చేయలేదు. ముందుగా, సవాయి నాలా శిబిరాన్ని లక్ష్యంగా చేసుకున్నాము. మేము జైషే(Jaishe), లష్కర్(Lashkar) శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నామని చెప్పుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే భార‌త్ దాడుల త‌ర్వాత పాక్ ప్ర‌ధాని ఆర్మీ అధికారుల త‌ర్వాత అత్య‌వ‌స‌ర భేటీ అయ్యారు. ఇక భారత్ పై పాక్ జరిపిన దాడులపై తాజాగా.. భారత్ మాజీ ఆర్మీ చీఫ్.. మనోజ్ ముకుంద్ నరవణే(Manoj Mukund Naravane) సంచలన ట్విట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ పై మాట్లాడుతూ.. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని చెప్పారు. అసలు సినిమా ముందుందని కూడా ట్విట్ చేశారు. అయితే పాక్ ఎలాంటి చర్యలకు దిగినా.. కౌంటర్ స్ట్రాంగ్ గా ఉంటుందని భారత్ పేర్కొంది.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...