HomeUncategorizedMukesh Ambani | ఆపరేష‌న్ సిందూర్ నాయక‌త్వానికి నిద‌ర్శ‌నం.. ప్ర‌ధానిపై ముఖేశ్ అంబానీ ప్ర‌శంస‌లు

Mukesh Ambani | ఆపరేష‌న్ సిందూర్ నాయక‌త్వానికి నిద‌ర్శ‌నం.. ప్ర‌ధానిపై ముఖేశ్ అంబానీ ప్ర‌శంస‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Mukesh Ambani | ఆప‌రేష‌న్ సిందూర్ (Operation Sindoor) విజ‌య‌వంత‌మైన నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)పై రిల‌యన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్ర‌శంస‌లు కురిపించారు. ఆయ‌న నాయ‌క‌త్వ ద‌క్ష‌త‌ను, భారత భద్రతా దళాల అసమాన ధైర్యసాహసాలను ప్రత్యేకoగా కొనియాడారు.

ప్ర‌ధాని నాయ‌క‌త్వ ప‌టిమను కొనియాడుతూ సెల్యూట్ చేస్తున్నాన‌ని చెప్పారు. భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాల (Indian security forces) ధైర్య సాహ‌సాల‌ను అభినందించిన ముకేశ్‌.. ‘ఆపరేషన్ సిందూర్‌’ విజయం ఈ రెండింటికీ నిలువెత్తు నిదర్శనమని ప్రశంసించారు. ఢిల్లీలో జరిగిన ‘రైజింగ్ నార్త్‌ఈస్ట్ ఇన్వెస్టర్స్ సదస్సు’లో ప్ర‌ధాని మోదీ స‌మ‌క్షంలో అంబానీ (Ambani)ఈ వ్యాఖ్య‌లు చేశారు. దేశ రాజ‌ధానిలో రెండు రోజుల పాటు రైజింగ్ నార్త్‌ఈస్ట్ ఇన్వెస్టర్స్ సదస్సును మోదీ శుక్ర‌వారం ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలలో పెట్టుబడులను ఆకర్షించి, ఆ ప్రాంత అభివృద్ధికి ఊతమివ్వడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు.

Mukesh Ambani | భిన్న‌త్వంలో ఏక‌త్వం: మోదీ

ఈశాన్య భార‌తం(Northeast India) ఒక ప‌వ‌ర్‌ హౌస్ అని, మ‌న‌కు అష్ట‌ల‌క్ష్మి వంటిందని ప్ర‌ధాని మోదీ అన్నారు. స‌మ్మిట్‌ను ప్రారంభించిన అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే మన దేశంలో, ఈశాన్య ప్రాంతం మరింత ప్రత్యేకమైన వైవిధ్యతను కలిగి ఉందని అన్నారు. ఈ ప్రాంతం ఒక ‘పవర్‌హౌస్‌'(Power House)గా ఆయన అభివర్ణించారు. ఇదే సదస్సులో పాల్గొన్న ముకేశ్ అంబానీ, ప్రధాని మోదీ నాయకత్వ పటిమకు సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. అలాగే, దేశ భద్రత కోసం అహర్నిశలు పాటుపడుతున్న భద్రతా బలగాల సాహసోపేత చర్యలను ప్రశంసించారు.

‘ఆపరేషన్ సిందూర్‌’పై ముకేశ్(Mukesh Ambani) ఇటీవ‌ల కూడా స్పందించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఐక్యంగా, స్థిరంగా, దృఢ సంకల్పంతో పోరాడుతోందన్నారు. “ప్రధాని మోదీ నాయకత్వంలో భారత బలగాలు సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద కార్యకలాపాలపై అత్యంత కచ్చితత్వంతో ప్ర‌తిస్పందించాయి. ఉగ్రవాదం విషయంలో భారత్ ఎన్నటికీ మౌనంగా ఉండబోదని, దేశంపై, పౌరులపై, సైన్యంపై జరిగే దాడులను ఎంతమాత్రం సహించబోదని మోదీ నాయకత్వం నిరూపించింది. శాంతికి భంగం కలిగించే ఎలాంటి ముప్పునైనా దీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది” అని అంబానీ పేర్కొన్నారు.