HomeUncategorizedOperation Sindoor | పాకిస్తాన్‌కు భారీ దెబ్బ.. భార‌త్ దాడితో తీవ్రంగా న‌ష్టపోయిన దాయాది

Operation Sindoor | పాకిస్తాన్‌కు భారీ దెబ్బ.. భార‌త్ దాడితో తీవ్రంగా న‌ష్టపోయిన దాయాది

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Sindoor | భార‌త్ దెబ్బ‌కు పాకిస్తాన్(Pakistan) కాళ్ల బేరానికి వ‌చ్చింది. ఆప‌రేష‌న్ సిందూర్‌(Operation Sindoor)తో తీవ్రంగా న‌ష్ట‌పోయిన పాక్‌.. కాల్పుల విర‌మ‌ణ అంటూ దిగొచ్చింది. కానీ, అప్ప‌టికే భార‌త్ కొట్టిన దెబ్బ దాయాదిని తీవ్రంగా న‌ష్ట‌ప‌రిచింది. పహల్​గామ్​ ఉగ్రదాడి(Pahalgam terror attack)కి వ్య‌తిరేకంగా భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్(Operation Sindoor) పాక్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టిన‌ట్లు తెలుస్తోంది. పాక్ వైమానిక దళానికి చెందిన నాలుగు ఎఫ్ 16 సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ల(F-16 fighter jets)ను భారత క్షిపణి వ్యవస్థ కూల్చి వేసింది. పాకిస్థాన్ వైమానిక దళం(Pakistan Air Force)లో అత్యంత కీలకమైన సర్గోదా వైమానిక స్థావరం(Sargodha Air Base) సైతం తీవ్రంగా దెబ్బతిన్నది. ఇందులోని రాడార్ వ్యవస్థ(Radar system) దాదాపుగా ధ్వంసమైంది. దీంతో వీటిని మరమ్మతులు చేయించాలంటే.. దాదాపు 100 మిలియన్ డాలర్లు అవసరమవుతాయని ఆయా నివేదికలు పేర్కొంటున్నాయి.

Operation Sindoor | భారీగా న‌ష్టం..

ఇన్నాళ్లు అణుబూచి చెప్పి పాకిస్తాన్ భ‌య‌పెట్టేది. కానీ, అదేది ప‌ట్టించుకోని భార‌త బ‌ల‌గాలు పాక్‌లోకి చొచ్చుకెళ్లి మ‌రీ విధ్వంసం సృష్టించాయి. ఆ దేశానికి చెందిన ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌, వైమానిక స్థావ‌రాల‌ను నేల‌మ‌ట్టం చేశాయి. దీంతో పాకిస్తాన్‌కు భారీగా న‌ష్టం వాటిల్లింది. ఇప్ప‌ట్లో అది కోలుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఎఫ్ 16 వల్ల 349.52 మిలియన్ డాలర్లు, సీ 130తో 40 మిలియన్ డాలర్లు, హెచ్‌క్యూ కారణంగా 200 మిలియన్ డాలర్లతోపాటు రెండు మొబైల్ కమాండ్ సెంటర్లు 10 మిలియన్ డాలర్లు మేర నష్టపోయిన‌ట్లు తాజా నివేదికలు వెల్ల‌డిస్తున్నాయి.

Operation Sindoor | ప‌హ‌ల్​గామ్ ఉగ్ర‌దాడికి నెల‌..

సరిగ్గా గత నెల ఇదే రోజు.. అంటే ఏప్రిల్ 22వ తేదీన పహల్​గామ్‌లోని పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మ‌తం అడుగుతూ కేవ‌లం హిందువుల‌ను టార్గెట్ చేసి అమాయ‌కుల‌ను ఊచ‌కోత కోశారు. ప్యాంట్లు విప్పి మ‌రీ నిర్ధారించుకున్న త‌ర్వాత కాల్పులు జ‌రిపారు. ఈ మార‌ణకాండ‌లో 26 మంది మరణించారు. ఈ దారుణం యావ‌త్ దేశాన్ని క‌దిలించింది. ఈ ఘటనకు కార‌ణ‌మైన పాకిస్థాన్‌పై త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని భార‌తావ‌ని ముక్త‌కంఠంతో నిన‌దించింది. ఈ నేప‌థ్యంలో ప‌హ‌ల్​గామ్​ ఉగ్ర‌దాడిలో పాక్ ప్ర‌మేయంపై కీల‌క ఆధారాలను సేకరించిన కేంద్రం.. ఆ దేశానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా సింధూ జలాల ఒప్పందాన్ని(Indus Waters Treaty) భారత్ రద్దు చేసింది. దీనికి ప్ర‌తిగా పాకిస్థాన్ సిమ్లా ఒప్పందాన్ని(Simla Agreement) రద్దు చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాంటి వేళ భారత్.. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) చేపట్టింది. పాక్‌తో పాటు పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్‌(Pakistan-occupied Kashmir)లో భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నిషేధిత జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలకు చెందిన తొమ్మిది రహస్య స్థావరాలను నెలమట్టం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మందికిపైగా ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే. మ‌రోవైపు, భార‌త దాడికి వ్య‌తిరేకంగా పాకిస్తాన్ ఇండియాపైకి డ్రోన్లు, క్షిప‌ణుల‌తో దాడికి దిగింది. మ‌న ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌తో వాట‌న్నింటినీ నిర్వీర్యం చేసిన ఇండియా.. పాకిస్తాన్ సౌనిక మౌలిక వ‌స‌తుల‌పై గురి పెట్టింది. అన్ని వైమానిక స్థావ‌రాల‌పై దాడి చేయ‌డంతో పాటు ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను ధ్వంసం చేసింది. దీంతో పాకిస్థాన్ దిగి వచ్చింది. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. కానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం ఇంకా కొనసాగుతోన్న విషయం విదితమే.