అక్షరటుడే, వెబ్‌డెస్క్:Operation Sindoor | జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి భారతీయులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్(Pakistan), పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలను మన సైనిక దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా విడుదల చేశాయి. మే 7వ తేదీన భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరిట ఈ మెరుపు దాడులు జరిపింది. ‘ఆపరేషన్ సిందూర్’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం (Indian Army) పాకిస్థాన్ లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను కేవలం 23 నిమిషాల్లో ధ్వంసం చేయడం గమనర్హం.
Operation Sindoor | గొప్ప నిర్ణయం..
అర్ధరాత్రి సమయంలో ఈ సాహసోపేత దాడి చేపట్టి, ఉగ్రవాద శక్తులకు గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఆపరేషన్‌ను పాఠ్యాంశంగా భారత విద్యార్థులకు బోధించేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Government) సిద్ధమవుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Education Minister Dharmendra Pradhan) ఇప్పటికే ఈ విషయంలో ప్రకటన చేశారు. తాజాగా ఎన్‌సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) అధికారికంగా స్పందించింది. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి, జాతీయ భద్రతపై అవగాహన కల్పించడానికి ఆపరేషన్ సిందూర్‌ను పాఠ్యాంశంగా చేర్చుతున్నట్లు వెల్లడించింది.ఈ విషయాన్ని బోధించేందుకు ప్రత్యేక మాడ్యూల్(Special Module)ను తయారు చేస్తున్నారు. దీన్ని రెండు భాగాలుగా విభజిస్తారు.
తరగతులు 3 నుంచి 8 విద్యార్థుల కోసం ఒక మాడ్యూల్, తరగతులు 9 నుంచి 12 విద్యార్థుల కోసం మరొక మాడ్యూల్ ఉంటుంది. ఈ మాడ్యూల్‌లో భారత సైనిక వ్యూహాలు, దౌత్యం ప్రాముఖ్యత, జాతీయ భద్రత వంటి అంశాలు ఉంటాయి. విద్యార్థులకు (Students) వీటిని ప్రాథమికంగా పరిచయం చేయాలని భావిస్తున్నారు.మరోవైపు అంతరిక్ష విజయాలని కూడా సిలబస్‌లోకి చేర్చనున్నారు. ఆదిత్య L1, చంద్రయాన్-3, అంతరిక్ష యాత్రికుడు శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విషయాలను కూడా కొత్త సిలబస్‌లో చేర్చనున్నారు. దేశం చేసిన విజ్ఞాన పురోగతిని పిల్లలకు తెలియజేయాలన్నదే దీనివెనుక ఉన్న ఆలోచన. ఈ నిర్ణయంతో విద్యార్థుల్లో దేశభక్తి, విజ్ఞానంకి సంబంధించిన ప్రయోగాలు, సైనిక విభాగాల పట్ల గౌరవభావం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.