అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Operation Sindoor Ganpati | గణేష్ నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ మహా నగరం ముస్తాబైంది. వివిధ రూపాల్లో గణనాథుల విగ్రహాలు కనువిందు చేయనున్నాయి. ఈసారి హైదరాబాద్ గణేష్ చతుర్థి వేడుకల్లో దేశభక్తి చాటేలా పలువురు గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఉప్పుగూడ(Uppuguda)లోని శ్రీ మల్లికార్జున స్వామి నగర్ యువజన సంఘం, భారత సైన్యం చేసిన సేవలకి ప్రతీకగా “ఆపరేషన్ సిందూర్”(Operation Sindoor) థీమ్‌తో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. సుమారు రూ. 6 లక్షల వ్యయంతో, స్థానిక కళాకారులు 50 రోజులకు పైగా శ్రమించి ఈ విగ్రహాన్ని సిద్ధం చేశారు. విగ్రహంతో బ్రహ్మోస్ క్షిపణులు(Brahmos Missiles), S-400 రైఫిల్స్, సైనిక దళాల నేపథ్య నిర్మాణాలు కనిపిస్తున్నాయి. ఇది భారత సైనికుల ధైర్యం, త్యాగాలను ప్రజల్లోకి చాటిచెప్పేలా ఉంది.
Operation Sindoor Ganpati | ఆపరేషన్ సిందూర్ కాన్సెప్ట్‌తో..
విగ్రహం తో పాటు భారతదేశ రక్షణ చరిత్రలోని ముఖ్యమైన యుద్ధాలు, ఘటనలను హైలైట్ చేస్తూ పోస్టర్లు ప్రదర్శించనున్నారు. వాటిలో 1947 ఇండో-పాక్ యుద్ధం, 1965, 1971 యుద్ధాలు, 1999 కార్గిల్ యుద్ధం, 2016 ఉరి దాడి, 2019 పుల్వామా దాడి, 2025లో జరిగిన ఆపరేషన్ సిందూర్ వంటి అంశాలు ఉంటాయి. “మా గణేశ్ జీ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ లాంటివాడు అని నిర్వాహకులు అంటున్నారు. “మేము ప్రపంచానికి స్త్రీ శక్తిని చూపించాలనే ఉద్దేశంతో ‘ఆపరేషన్ సిందూర్’ను థీమ్‌గా ఎంచుకున్నాం. కేవలం ఇద్దరు మహిళలు పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి, అరగంటలో ఆపరేషన్‌ను ముగించగలగడం గర్వించదగిన విషయం. దీన్ని చూసి యువత ప్రేరణ పొందాలి” అని తెలిపారు.
మరోవైపు హైదరాబాద్(Hyderabad)లో మరో ఆపరేషన్ సిందూర్ విగ్రహం కనిపించింది. ట్రాక్టర్‌పైన తరలిస్తుండగా, ఇది అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. మిస్సైల్స్‌తో పాటు మోదీని కూడా మనం ఇందులో చూడవచ్చు. ఈ విగ్రహం కూడా చూపరులని ఎంతగానో ఆకర్షిస్తోంది. వీటి నమూనాల కోసం గూగుల్ ఆధారంగా డిజైన్లు తీసుకుని, స్థానిక శిల్పకళతో రూపొందించారట. ఇది నిజంగా ఒక వినూత్న, దేశభక్తితో కూడిన ప్రదర్శన. దేశాన్ని కాపాడిన సైనికుల ధైర్యసాహసాలు, త్యాగాలను గుర్తు చేస్తూ ఈ థీమ్‌తో చాలా చోట్ల గణనాథులు కొలువుదీరుతున్నారు.
1 comment
[…] హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తదుపరి దశ మొదటి దశ కంటే తీవ్రంగా […]
Comments are closed.