HomeUncategorizedOperation Sindoor | పాక్​ వెన్నులో భయం.. ఆ దేశ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు

Operation Sindoor | పాక్​ వెన్నులో భయం.. ఆ దేశ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Operation Sindoor | భారత్​ చేపట్టిన ఆపరేషన్​ సింధూర్​(Operation Sindoor)తో పాక్​ వెన్నులో భయం పుట్టింది. తమ దేశంలోకి చొచ్చుకొచ్చి మరి ఉగ్రవాద శిబిరాలను భారత్(India) ధ్వంసం చేయడంతో ఆ దేశంలో ఆందోళన నెలకొంది. తాము ప్రతిదాడి చేస్తే భారత్​ మరింత పెద్ద దాడి చేసే అవకాశం ఉందని పాకిస్తాన్​ నేతలు(Pakistan Leaders) భయపడుతున్నారు. ఆపరేషన్​ సింధూర్​కు ప్రతి దాడి తప్పదని పలువురు నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. ఆర్మీ అధికారుల్లో కూడా భయం ఉంది. ఈ క్రమంలో పాక్​ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసీఫ్(Pakistan Defense Minister Khawaja Asif)​ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్​ దాడులు ఆపేస్తే తాము ప్రతి చేయమని ఆయన వ్యాఖ్యానించారు. భారత్​ మళ్లీ దాడులు చేయకపోతే తాము ప్రతీకారానికి దిగమని ఆయన ప్రకటించారు.

Operation Sindoor | భయాందోళనలో ప్రజలు

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్​పై భారత్​ దాడి చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యుద్ధ భయంతో ఆ దేశస్తులు బ్యాంకులు(Banks), ఏటీఎం(ATM)ల ముందు బారులు తీరారు. డబ్బులు డ్రా చేసుకొని ఎక్కువ మొత్తంలో నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి యత్నిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడానికి పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) ఎఫెక్ట్​తో పాక్ స్టాక్ మార్కెట్లు కుప్ప కూలాయి. దాదాపు 6 శాతం మేర సూచీలు పడిపోయాయి.