అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC అత్యవసర సమావేశం నిర్వహించింది. సమావేశం అనంతరం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ Rahul Gandhi మీడియాతో మాట్లాడారు. భారత ఆర్మీ చర్యలను ఆయన సమర్థించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు భారత బలగాలకు ఎప్పుడు ఉంటుందన్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పీవోకేతో పాటు పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో దాదాపు వంద మంది ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది.
