HomeUncategorizedOperation Sindoor | చెప్పి మరి దాడి.. ముందే హింట్​ ఇచ్చిన ఆర్మీ

Operation Sindoor | చెప్పి మరి దాడి.. ముందే హింట్​ ఇచ్చిన ఆర్మీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Operation Sindoor | పహల్గామ్​ ఉగ్రదాడిపై pahalgam terror attack ప్రతీకారంతో ఉన్న భారత్​ చెప్పి మరి పాక్​పై దాడి చేసింది.

ఉగ్రవాదులకు గట్టిగా బదులిస్తామని భారత ప్రధాని మోదీ PM Modi ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆపరేషన్​ సింధూర్​కు కొద్ది నిమిషాల ముందే ఇండియన్​​ ఆర్మీ హింట్​ ఇచ్చింది. పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై దాడికి కొన్ని నిమిషాల ముందు ఇండియన్ ఆర్మీ ఎక్స్​లో ఓ వీడియో పోస్ట్​ చేసింది.

‘రెడీ టు స్ట్రైక్, ట్రైన్డ్ టు విన్’ ready to strike.. ready to win అనే క్యాప్షన్​తో మంగళవారం అర్ధరాత్రి ఓ వీడియోను పోస్ట్​ చేసింది. ఆ తర్వాతి 15 నిమిషాలకే భారత వాయుసేన పాక్​, పీవోకేలోని ఉగ్రశిబిరాలపై terrorist camps విరుచుకు పడింది. కాగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది.

Must Read
Related News