Operation Sindoor | వారికి న్యాయం చేయడానికే ఆపరేషన్​ సింధూర్​
Operation Sindoor | వారికి న్యాయం చేయడానికే ఆపరేషన్​ సింధూర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | పహల్గామ్​ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం చేయడానికే ఆపరేషన్​ సింధూర్​ చేపట్టినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఆపరేషన్​ సింధూర్​ వివరాలను బుధవారం ఉదయం వారు వెల్లడించారు. ఈ సందర్భంగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్​ మిస్త్రీ మాట్లాడుతూ.. పాక్​ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ఈ ఉగ్రదాడి వెనుక లాష్కరే తోయిబా కుట్ర ఉందని, లాష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ఈ దాడి చేసిందన్నారు.

పార్లమెంట్​ దాడి నుంచి పహల్గామ్​ వరకు ఉగ్రదాడుల్లో 350 మంది మృతి చెందారని పేర్కొన్నారు. ముంబయి దాడుల తర్వాత పహల్గామ్​ రెండో పెద్ద దాడి. ఇందులో 26 మంది మృతి చెందారు.. కశ్మీర్​లో శాంతిని భగ్నం చేయడానికే ఈ దాడి చేశారని చెప్పారు. దీంతో భారత్​ తన అధికారాన్ని ఉపయోగించి, పాక్​సరిహద్దును దాటి దాడి చేసిందన్నారు.

Operation Sindoor | అందుకే ఆపరేషన్​

పాక్​ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్​లో మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని మిస్త్రీ అన్నారు. అందుకే సరిహద్దు దాటి ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశామని స్పష్టం చేశారు. ఉగ్రవాదులపై పాక్​ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఉగ్రదాడి చేసిన వారిని కుట్రదారులను, దాని వెనుక ఉన్న వారిని గుర్తించామని ఆయన వెల్లడించారు. దాడికి పాల్పడ్డ వారికి ఖచ్చితంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.

Operation Sindoor | ఉగ్ర శిబిరాలను గుర్తించి.. దాడులు

పాకిస్తాన్​ 3 దశబ్దాలుగా ఉగ్రవాదులకు సదుపాయాలు కల్పిస్తోందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. వారి కోసం శిక్షణ శిబిరాలు, లాంచ్​ ప్యాడ్స్​ నిర్మించిందన్నారు. పహల్గామ్​ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం చేయడానికే ఆపరేషన్​ సింధూర్​ చేపట్టామన్నారు. ఇంటెలిజెన్స్​ వర్గాల సమాచారం మేరకు ఉగ్రవాద శిబిరాలను గుర్తించి తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేశామన్నారు. సామాన్య పౌరులకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా దాడులు చేశామని వివరించారు.

Operation Sindoor | అక్కటే కుట్ర

నియంత్రణ రేఖ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముజఫరాబాద్​లోని ఎల్ఈటీ క్యాంపుపై తొలి దాడి చేశామన్నారు. ఎల్ఓసీలోని బింబల్ క్యాంపు లాష్కరే తోయిబా ఉగ్రవాడులకు ట్రైనింగ్ ఇస్తుందచి చెప్పారు. దీనిపై కూడా దాడి చేసినట్లు వివరించారు. పాకిస్తాన్​లోని సర్జల్, ముర్కిదే క్యాంపుపై దాడి చేసినట్లు వివరించారు. ముర్కిదే క్యాంపులోనే ముంబై పేలుళ్లకు కుట్ర జరిగిందని, కసబ్ అక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడని తెలిపారు.