అక్షరటుడే, వెబ్‌డెస్క్: Operation Sindoor | పాకిస్తాన్ (pakistan) ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో (financial trouble) కొట్టుమిట్టాడుతోంది. ఐఎంఎఫ్ నుంచి రుణం (IMF fund) వస్తేగానీ ఆ దేశంలో పూట గడిచే పరిస్థితి లేదు. అయినా దాయదీ దేశం తమ ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టకుండా.. భారత్‌పై విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ భారత్‌పై దాడులు చేయిస్తోంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడికి (pahalgam terror attack) ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో (operation sindoor) పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఓ వైపు ఆర్థిక మాంధ్యంతో ఉన్నా.. మరోవైపు భారత్‌పై దాడులకు (pakistan attacks on india) దిగుతోంది. అయితే భారత్‌తో తలపడే శక్తి లేని ఆ దేశం తాజాగా తమను ఆదుకోవాలని మిత్రదేశాలను కోరింది.
పహల్గామ్ దాడి (pahalgam terror attack) తర్వాత పాక్‌పై భారత్ అనేక ఆంక్షలు విధించింది. సింధూ జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది (canceled Indus Waters). ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో (pakistan financial troubels) ఉన్న భారత్‌తో తలపడితే మరింత సంక్షోభంలో కూరుకుపోనుంది. ఈ క్రమంలో పాక్ ఆర్థిక శాఖ (pakistan finance mnistry) తమకు అప్పులు ఇచ్చి ఆదుకోవాలని మిత్ర దేశాలను కోరింది. భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఆర్థిక వ్యవస్థ పతనం అయిందని, స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయని దాయాది దేశం పేర్కొంది. తమకు అప్పులు ఇవ్వడంతో పాటు ఉద్రిక్తతలను తగ్గించడంలో సాయం చేయాలని మిత్ర దేశాలను పాక్ కోరింది.